Politics

జగన్‌కు రాజధాని రైతుల సెగ-తాజావార్తలు

News Roundup - Capital Farmers Protest Against CM YS Jagan

* సీఎం జగన్‌కు అమరావతి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది.మంత్రివర్గ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి సచివాలయానికి వెళ్తుండగా మందడం వద్ద రైతులు జై అమరావతి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.అమరావతి భూములను విక్రయిస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని రాజధాని రైతులు తేల్చిచెప్పారు.రేషన్ బియ్యం ఇచ్చేందుకు రూ.4వేల కోట్లతో కొనుగోలు చేసిన వాహనాలు అప్పుడే మూలనపడుతున్నాయని ఆరోపించారు.సంక్షేమ పథకాల పేరుతో డబ్బులను వృథా చేస్తున్నారని వాటితో రాజధానిని అభివృద్ధి చేయవచ్చని పేర్కొన్నారు.

* తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు పూర్తి అయింది.ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలతో గడువు ముగిసింది. మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు 60కి పైగా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం- నల్లగొండ-వరంగల్ స్థానానికి చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యాయి.రేపు నామినేషన్ల పరిశీలన జరుగనుంది. ఈ నెల 26వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది.ఇక మార్చి 14వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మార్చి 17 తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు అధికారులు.

* తెలంగాణ శాసనసభ పాత భవనం ఘటనపై సభ కార్యదర్శి డాక్టర్ వి.నరసింహా చార్యులు స్పందించారు.ఏటా గోడలు, సీలింగ్ నుంచి సున్నం, గచ్చు పెచ్చులు జారడం సహజమని పేర్కొన్నారు.అసెంబ్లీ ఇంజనీరింగ్ విభాగం ఆయా ప్రాంతాలను గుర్తించి మరమ్మతులు చేపడతూ ఉందన్నారు.ప్రధాన స్ట్రక్చర్‌లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.పటిష్టంగా ఉన్నదని, అధికారులు, ఇంజనీరింగ్ విభాగం నిత్యం శాసనసభ భవనంతో పాటుగా అనుబంధ కార్యాలయాలు ఉన్న భవనాలను పరిశిలిస్తున్నారని చెప్పారు.ఎల్లవేళలా, అప్రమత్తంగా ఉంటూ, అవసరమైన మేరకు మరమ్మతులు చేపడుతున్నామని ఆయన అన్నారు.పాత భవనం నిర్మించి వందేళ్ళకు పైగా అయిందని, అప్పటి టెక్నాలజీ ప్రకారం డంగు సున్నంతో నిర్మించారని చెప్పారు.

* పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా తగ్గుముఖం పడతాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు.గత కొద్దిరోజులుగా ఇంధనం ధరలు పెరుగుతూ పోతుండటంతో వినియోగదారుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగడంతో వినియోగదారుల ధరలు (పెట్రోల్, డీజిల్‌కు) కూడా పెరుగుతూ వస్తున్నాయని మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.క్రమంగా ధరలు తగ్గుముఖం పడతాయని అన్నారు.కోవిడ్ కారణం గ్లోబల్ సరఫరా కూడా తగ్గిందని, ఆ ప్రభావం చమురు ఉత్పత్తిపై కూడా పడిందని చెప్పారు.పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని తాము జీఎస్‌టీ కౌన్సిల్‌కు తరచు విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తెస్తే ప్రజలకు మేలు చేకూరుతుందన్నారు.దీనిపై జీఎస్‌టీ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు.

* అనంతపురం జిల్లాలో పోలీసులకు కోవిడ్ వ్యాక్సి నేషన్ ప్రారంభమైంది.జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో పని చేస్తున్న పోలీసు సిబ్బంది కోసం స్థానిక డి టి సి లో కోవిడ్ వాక్సినేషన్ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి కోవ్యాక్సిన్ వేస్తున్నారు.జిల్లాలో పనిచేస్తున్న ప్రతి పోలీస్ సిబ్బంది కో వ్యాక్సిన్ను వేయించుకునేలా జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు ఈఫ్శ్ గారు సూచనలు జారీ చేశారు.జిల్లాలోని ఇతర పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉన్న పోలీస్ స్టేషన్లలోని సిబ్బంది సమీప పీహెచ్సీలలో ఈ వ్యాక్సిన్ వేయించుకునేలా ఏర్పాట్లు చేశారు.

* ఓటు వేయలేదని చంపడానికి యత్నించిన వైసీపీ గుండాలు…విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించిన విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య.జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన శెట్టి తిరుపతి కుటుంబం ఆరంభం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండటం జరిగింది.మొన్న జరిగిన మొదటి విడత పంచాయతీ ఎన్నికలలో అధికార వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి , వారి అనుచరులు కచ్చితంగా ఓటు వేయాలని అనగా తిరుపతి మేము మొదటి నుంచి టిడిపి పార్టీ కుటుంబ సభ్యులని తెలుపగా సరే అని వెళ్లిన వారు ,ఎన్నికలు ముగిసిన తర్వాత ఓటమి చెందిన కారణంగా కక్ష పెంచుకుని తిరుపతి కుటుంబంపై 22.02.2021 వ తేదీ రాత్రి సమయంలో రాడ్లు ,గొడ్డలితో దాడి చేసి వారిని వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచారు.

* ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత మంగళవారం భేటీ అయిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఎంపీటీసీ, జడ్పిటిసి, మున్సిపల్ ఎన్నికల పై చర్చ..కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రులకు జగన్ దిశానిర్దేశం..అన్ని ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న జగన్..కుప్పం కోటను బద్దలు కొట్టారు అంటూ మంత్రి పెద్దిరెడ్డి కి జగన్ ప్రశంసలు..ముందు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని కోరదాం.

* ఎర్రన్నాయడు జయంతి సందర్భంగా ఆయనను స్మరిస్తూ ట్వీట్ చేసిన చంద్రబాబు

* ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా పడింది.

* రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌-2020 రెండోదశ అడ్మిషన్ల ప్రక్రియ ఈ నెల 25-26 తేదీల్లో జరగనుంది.

* బోధన్‌ పాస్‌పోర్టు కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్‌ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్సై మల్లేష్‌రావు, ఏఎస్సై అనిల్‌కుమార్‌ కూడా ఉన్నట్లు సీపీ తెలిపారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సజ్జనార్‌ మీడియాకు వివరించారు.

* ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 28,268 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 70 కేసులు నిర్ధారణ కాగా.. విశాఖలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,89,409కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,168 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 84 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,81,666కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 575 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,37,75,253 కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.

* భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. దేశంలో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 75శాతం కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్రలోనే అత్యధికంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై వైద్య శాఖ అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘ఈ రోజు మధ్యాహ్నం 1గంట వరకు దేశ వ్యాప్తంగా 1,17,54,788 డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ జరిగింది. దీంట్లో తొలి డోసు 1,04,93,205మందికి పంపిణీ చేయగా.. 12,61,583 మందికి రెండో డోసు వేశాం. 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 75శాతానికి పైగా ఆరోగ్య కార్యకర్తలకు టీకా పంపిణీ జరిగింది. 9 రాష్ట్రాల్లో 60శాతం కరోనా యోధులకు టీకాలు ఇచ్చాం.’’ అన్నారు.

* పంచాయతీ ఎన్నికల కోసం గ్రామాల్లో డబ్బే కీలకపాత్ర పోషించిందని.. ఆధిపత్యం కోసం ఓటుకు రూ.5వేలు కూడా పంచారని తెదేపా నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల్లో డబ్బు పంచకుండా ప్రధానమంత్రి గెలిస్తే తన ఆస్తి మొత్తం వదిలేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. అనంతపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జేసీ మాట్లాడారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలంటూ పోలీసులు బహిరంగంగా బెదిరించారని ఆరోపించారు. తాడిపత్రిలో ఏడాది క్రితం మున్సిపల్‌ ఎన్నికలకు ఓ నేత నామినేషన్‌ దాఖలు చేస్తే వైకాపా నేతలు చించేశారని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.