Movies

శ్రీదేవి తర్వాత నేనే

అందాల తార శ్రీదేవి తరువాత సినిమాల్లో కామెడీ పాత్రలు చేయగలిగిన సత్తా తనదేనని బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ అన్నారు. కంగనా నటించిన ‘తను వెడ్స్‌ మను’ సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి25) 10 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా నటనలో కొత్త మార్గాలను చూపించిందని పేర్కొన్నారు. 2011లో విడుదలైన ఈ చిత్రానికి అనంతరం 2015లో సిక్వెల్‌ రూపొందించారు. ఇందులో కంగనా ద్విపాత్రాభినయం పోషించారు. సినిమా పదేళ్లు పూర్తయిన సందర్భంగా కంగనా సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.