DailyDose

కోడిపై మర్డర్ కేసు-నేరవార్తలు

Crime News - Murder Case Filed On Chicken

* మీరు చదివింది నిజమే! అరెస్ట్ చేసిన పోలీసులు..ఏదైనా నేరం జరిగినప్పుడు అందులో నిందితులను అరెస్ట్ చేయాల్సిందే..అందులోనూ ఓ వ్యక్తి మరణానికి కారణమైన వారు.. ఎంతటి వారైనా అదుపు లోకి తీసుకోవాల్సిందే..విచారణ చేసి నిజానిజాలు రాబట్టి.. దోషులకు శిక్ష పడేలా చూసే బాధ్యత పోలీసులపై ఉంటుంది.జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో మరణించిన ఓ వ్యక్తి విషయం లోనూ పోలీసులు తమ విధిని నిర్వర్తించారు.సదరు వ్యక్తి మృతికి ఓ కోడి కారణమని తేల్చిన పోలీసులు..హత్యా నేరం కింద కోడి ని అరెస్ట్​ చేశారు..ఇటీవలే ప్రమాదవశాత్తు.. కోడి కత్తి మర్మాంగాలకు తగిలి ఓ వ్యక్తి మరణించిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో చోటు చేసుకుంది.లొత్తునూర్‌ శివారులో కోడి పందెం నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు.వెల్గటూరు మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సతీశ్‌ (45) ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.ఇందులో భాగంగా.. కోడి కాలికి కత్తి కట్టేటప్పుడు అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది.ఈ క్రమంలో ఆ కత్తి.. సతీశ్​ పురుషాంగానికి, వృషణాలకు తగలగా అక్కడే కుప్ప కూలాడు.అక్కడున్న వారు వెంటనే స్పందించి క్షతగాత్రున్ని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్య లోనే సతీశ్​ మృతి చెందాడు.సతీశ్​ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.ఘటన పై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు.సతీశ్​ మరణించడానికి సదరు కోడి కారణమని తేల్చారు.కోడిని హత్యా నేరం కింద అరెస్ట్ చేశారు.పోలీస్​ స్టేషన్​ లోనే దాణా ఏర్పాటు చేసి జాగ్రత్తగా చూసుకుంటున్నారు.

* తుని రైలు దహనం ఘటనలో కాపు ఉద్యమ నేత ముద్రగడతో సహా, నిందితులకు విజయవాడ రైల్వే కోర్టు షాక్ ఇచ్చింది. మార్చి 3న కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. ముద్రగడతో పాటు సమన్లు జారీ అయిన వారిలో మంచాల సాయి సుధాకర్ నాయుడు, మరికొందరు నిందితులు ఉన్నారు. 2016 జనవరి 31న తుని వద్ద రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు దహనం జరిగింది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ముద్రగడ పద్మనాభం ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. కాపు ఐక్య గర్జన వేదిక పేరుతో ఆరోజు తునిలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఆ సభ ముగిసిన అనంతరం, సభా ప్రాంగణానికి కొద్ది దూరంలోనే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ తగలబడింది. దీనికి సంబంధించి అప్పట్లో రైల్వే చట్టం సెక్షన్ 146,147,153,174 కింద ముద్రగడతో సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే.

* ప్రతిపక్ష నేత చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగడం సహా బెదిరింపులకూ పాల్పడుతున్నారని.. ఆయన మాటలకు బాధపడి ఎవరైనా ప్రతిస్పందిస్తే తమకు సంబంధం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. గురువారమిక్కడ తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో ఓటమిపాలైనప్పటి నుంచి చంద్రబాబుకు వయసు పెరగడం వల్ల వచ్చిన మార్పులు.. ఇతర కారణాలతో వ్యక్తిగత దూషణకు దిగుతూ జుగుప్సాకరమైన భాషను ప్రయోగిస్తున్నారని అన్నారు. విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానందపైనా ఇష్టారీతిన మాట్లాడారని ఆక్షేపించారు. ఆయన హత్యా రాజకీయాలు నడుపుతున్నారని.. సీఎం జగన్‌ ఆయన పీఠానికి వెళ్తుంటే.. ఐఎఎ్‌సలూ, ఐపీఎ్‌సలూ అక్కడకే వెళ్తున్నారని.. ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని విమర్శలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా కుప్పం పర్యటన సందర్భంగా.. వైసీపీ ముఖ్యనేతలపై చంద్రబాబు ఇష్టం వచ్చినట్లుగా బెదిరింపులకు దిగుతున్నారని.. ఇదే భాష ఉపయోగిస్తే..ఎవరికైనా బాధ కలిగి ప్రతిస్పందిస్తే ప్రభుత్వానికేమీ సంబంధం ఉండదన్నారు.

* ఆస్తి తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య గా తెలిపిన తిరువూరు సీఐ శేఖర్ బాబు.గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో నోముల సీతారాములను(60) అతి కిరాతకంగా కొట్టి చంపిన నోముల ఆంజనేయలను(30) మీడియా ముందు ప్రవేశ పెట్టిన తిరువూరు సి ఐ శేఖర్ బాబు.తిరువూరు సీఐ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం ఆంజనేయులు తాగిన మత్తులో ఉద్దేశపూర్వకంగానే సీతారాముల పై కర్ర తోదాడి చేయగా తల పై గట్టిగా తగలడంతో తీవ్ర రక్తస్రావం అవ్వగా వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి లో చేర్చాగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గంపలగూడెం ఎస్సై సతీష్ హత్య చేసిన నోముల ఆంజనేయులను అరెస్టు చేయడం జరిగిందని తిరువూరు సీఐ శేఖర్ బాబు తెలిపారు.నిందితుని నుంచి హత్యకు ఉపయోగించిన కర్ర ను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు..!

* మైనర్ బాలికపై…గుంటూరు బెల్లంకొండ మండలం మాచయపాలెం గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం.ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారనికి పాల్పడ్డ యువకుడు..కేసు నమోదు, అరెస్టు చేసిన పోలీసులు.