Politics

అయిదు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగరా-తాజావార్తలు

అయిదు రాష్ట్రాల ఎన్నికలకు మోగిన నగరా-తాజావార్తలు

* ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు.* 16 రాష్ట్రాల్లోని 34 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.* ఈ సారి ఎన్నికలకు ఆన్‌లైన్ నామినేషన్లకు అవకాశం.* ఇంటింటి ఎన్నికల ప్రచారానికి ఐదుగురికే అనుమతి-సీఈసీ* పోలింగ్ సిబ్బంది మొత్తానికి వ్యాక్సినేషన్..* వ్యాక్సిన్ తీసుకున్నవారినే ఎన్నికల సిబ్బందిగా నియమిస్తాం-సీఈసీ* 80 ఏళ్లు పైబడిన వృద్ధులు పోస్టల్ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చు-సీఈసీ* ఐదు రాష్ట్రాల్లో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడు… మే2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు-సీఈసీకేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒకే విడతలో ఏప్రిల్ 6న ఎన్నికల పోలింగ్* అసోంలో మూడు దశల్లో పోలింగ్..* మార్చి 27న తొలి విడత.. ఏప్రిల్ 1న రెండో విడత, ఏప్రిల్ 6న మూడో విడత పోలింగ్.పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది విడతల్లో ఎన్నికల పోలింగ్.* మార్చి 27 తొలి విడత, ఏప్రిల్ 1న రెండో విడత, ఏప్రిల్ 6న మూడో విడత, ఏప్రిల్ 10న నాల్గో విడత,* ఏప్రిల్ 17న ఐదో విడత, ఏప్రిల్ 22న ఆరో విడత, ఏప్రిల్ 26న ఏడో విడత, ఏప్రిల్ 29న ఎనిమిదో విడత పోలింగ్.అన్ని రాష్ట్రాల్లో మే-2న కౌంటింగ్

* రాష్ట్రంలో మార్చి 1 నుంచి స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టం చేశారు. మార్చి 1 నుంచి స్కూళ్లకు సెలవులంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తల్లో నిజంలేదని మంత్రి ఆదిమూలపు తెలిపారు. సోషల్ మీడియాలో స్కూళ్ల పై అవాస్తవాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సురేష్‌ హెచ్చరించారు. స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని ఆయన తెలిపారు. జూనియర్‌ కాలేజీలు కూడా షెడ్యూల్‌ ప్రకారమే నడుస్తాయని సురేష్‌ పేర్కొన్నారు.

* ఏపీలో రేపు SEC నిమ్మగడ్డ రమేశ్ పర్యటించనున్నారు ..13 జిల్లాల్లో మూడు రోజుల పాటు ఆయన పర్యటన ఉండనుండగా….రేపు చిత్తూరు , నెల్లూరు , కడప , అనంతపురం , కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు…ఈ పర్యటనలో అధికారులు…రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నారు . మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.

* 7 రాష్ట్రాల్లో కొత్తగా 90 శాతం కోవిడ్ కేసులు నమోదు: ఆరోగ్య మంత్రిత్వ శాఖ. 7 రాష్ట్రాల్లో కొత్తగా 90శాతం కోవిడ్-19 కేసులు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దేశంలో గురువారం నమోదైన కొత్త కేసుల్లో ఏడు రాష్ట్రాల్లో 89.57 శాతంగా నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మహారాష్ట్రలో అత్యధికంగా 8,807 కేసులు నమోదయ్యాయి. కేరళ (4,106), పంజాబ్ (558), తమిళనాడు (463), గుజరాత్ (380), మధ్యప్రదేశ్ (344), కర్ణాటక (334) కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 16,738 కొత్తగా రోజువారీ కేసులు నమోదయ్యాయి.

* మంగళగిరి మండలం కృష్ణాయపాలెం గ్రామములో అమరావతి రాజధాని కృష్ణాయపాలెం ఐకాస ఆధ్వర్యంలో అమరావతి రైతుల నిరసన దీక్ష 437 రోజు నిర్వహించారు.

* విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నేడు రాస్తారోకోకు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహదారుల దిగ్బంధం చేయనున్నారు. రాస్తారోకోకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

* బీజేపీ సీనియర్‌ నాయకుడు, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయకు తీవ్ర పరాభవం ఎదురయ్యింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు దత్తాత్రేయపై దాడి చేశారు. బడ్జెట్‌ స్పీచ్‌ అనంతరం బయటకు వెళ్తోన్న దత్తాత్రేయపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దాడి చేశారు. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ భరద్వాజ్ మాట్లాడుతూ.. గవర్నర్ తన వాహనం వద్దకు వెళుతున్నప్పుడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆయనపై దాడి చేశారని తెలిపారు.

* టాలీవుడ్‌ హీరో నితిన్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం చెక్‌. ఈ సినిమా నేడు(ఫిబ్రవరి26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చంద్రశేఖర్‌ యేలేటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతానికైతే జనాల్లో పర్వాలేదనే టాక్‌ తెచ్చుకుంటోంది. కల్యాణీ మాలిక్‌ సంగీతం ఈ సినిమా ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటించారు. సినిమాల్లో రకుల్‌ చాలా సన్నివేశాల్లో కనిపించినా ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదనిపిస్తోంది. అదే ప్రియ విషయానికొస్తే చేసింది చిన్న క్యారెక్టర్‌ అయినా తన నటనతో మంచి మార్కులే కొట్టేసింది. దీంతో ఢిల్లీ భామ(రకుల్‌) హర్ట్‌ అయినట్లు తెలుస్తోంది. చెక్‌లో తన పాత్ర కన్నా ప్రియా ప్రకాశ్‌ పాత్ర ఎక్కువ ఉండటం రకుల్‌కు నచ్చలేదట. అంతేగాక నితిన్‌, ప్రియ మధ్య ఎలాంటి పాటలు ఉండవని చెప్పి చివరికి వీరిద్దరి కలయికలో ఓ పాట కూడా చిత్రీకరించడంతో ఈ భామ హర్ట్‌ అయ్యిందటా.

* కాకినాడ సెజ్‌‌(స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌) భూములను వెనక్కి ఇచ్చేయడం చారిత్రాత్మక నిర్ణయమని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. పిఠాపురం వద్ద పాదయాత్ర బహిరంగ సభలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం సెజ్‌‌ భూములపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం జగన్‌ దమ్మున్న నాయకుడని కొనియాడారు. జిల్లాలో శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్ నందిగ్రామ్‌లో భూముల వ్యవహారంలో పెద్ద ఎత్తున శాంతి భద్రతల సమస్య ఎదురైందన్నారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి రానీయలేదని, సెజ్‌‌ నుంచి ఆరు గ్రామాలను విడిచిపెట్టడం జరిగిందన్నారు. రైతుల సెంటిమెంట్‌ను సీఎం జగన్‌ గౌరవించారన్నారు.

* భార్య టీ ఇవ్వడానికి నిరాకరించడం తనపై దాడికి ఉసిగొల్పడంగా భావించలేమని, భార్యని ఒక పశువులా చూడడం తగదని, ఆమె ఒక పశువు లేదా, ఒక వస్తువు కాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. టీ ఇవ్వలేదన్న కారణంతో తన భార్యపై దాడికి పాల్పడిన 35 ఏళ్ళ సంతోష్‌ అట్కర్‌కి 2016లో స్థానిక పంధార్‌పూర్‌ కోర్టు విధించిన 10 ఏళ్ళ జైలు శిక్షను బాంబే హైకోర్టు సమర్థించింది. ‘‘వివాహం సమానత్వంపై ఆధారపడిన భాగస్వామ్యమని’’అని జస్టిస్‌ రేవతి మోహిత్‌ డేరె జారీ చేసిన ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు.

* ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఒమన్‌ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ రెసిడెంట్‌ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌) గురువారం స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది. ఒమన్‌ రాజధాని మస్కట్‌ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ ముగ్గురు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లావారు కాగా, మరొకరు కడపకు చెందినవారు.

* పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు భారీ ఎత్తున గెలిచినా, చంద్రబాబు మాత్రం తామే గెలిచామంటూ టపాసులు కాల్చాడం చాలా విడ్డూరంగా ఉందని రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..’టీడీపీ ఆవిర్భాం నుంచి కంచుకోటగా ఉన్న పంచాయతీల్లో కూడా వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడింది. కుప్పంలో టీడీపీ కేవలం 14 పంచాయతీలు మాత్రమే గెలిచారు. రాష్ట్రమంతా ఇలానే ఉన్నా చంద్రబాబు మాత్రం ప్రజస్వామ్యం ఓడిందంటున్నారు. నామినేషన్ వేయడానికి కూడా కుప్పం వెళ్లని చంద్రబాబుని జగన్ కుప్పం రప్పించారు. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు బజారు బజారు తిరుగుతున్నారు…ఇది జగన్మోహన్ రెడ్డి గొప్పదనం’ అని అంబటి రాంబాబు అన్నారు.

* ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన 17 అంశాల్లో 2030 నాటికి స్ధిరమైన అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా నేషనల్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌ జరుపుకొంటున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ సదస్సు ముగిసేనాటికి ఆయా రంగాల్లో ప్రస్తుతం మనమేం చేస్తున్నాం, భవిష్యత్తులో ఏం చెయ్యాలన్నదానిపై ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలో జరుగుతున్న 69వ జాతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌కు సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ఈ సమావేశానికి హాజరైన టౌన్‌ ప్లానింగ్‌ అధికార్లు, డైరెక్టర్లు, అకడమిస్టులు, పరిశోధకులు, ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ రంగాల నుంచి వచ్చిన నిపుణులకు అభినందనలు తెలిపారు.