DailyDose

కుప్పంలో బెట్టింగ్‌కు విద్యార్థి బలి-నేరవార్తలు

Engineering Student Commits Suicide In Kuppam-Telugu Crime News

* బెట్టింగులకు పాల్పడి తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకున్నాడు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. ఈ దారుణ సంఘటన జిల్లాలోని కుప్పంలో జరిగింది. పట్టణానికి చెందిన కిరణ్‌ ఇంజనీరింగ్ చదవుతున్నాడు. సోషల్ మీడియలో వస్తున్న బెట్టింగ్ ప్రకటనలకు ఆకర్షితుడయ్యాడు. బెట్టింగ్‌ల వ్యసనానికి బానిసగా మారాడు. దీంతో వివిధ బెట్టింగ్‌ల్లో డబ్బులు పెట్టాడు. తెలిసిన వారి దగ్గరా అప్పులు చేశాడు. అయితే అనుకున్నంత సంపాదన రాలేదు. దీంతో అప్పులపాలై ఆ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడిని శాంతిపురం మండలం రాళ్లబుదుగురుకు చెందిన మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బసవరాజు కుమారుడిగా గుర్తించారు. బెట్టింగ్‌లతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఇన్‌స్టాగ్రాంలో చనిపోయే ముందు కిరణ్ పోస్ట్‌ చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* సైదాపురం ఎమ్మార్వో చంద్ర‌శేఖ‌ర్ ను స‌స్పెంట్ చేస్తూ క‌లెక్ట‌ర్ శేష‌గిరిబాబు ఉత్త‌ర్వులు జారీ చేశారు. మ‌ల్లాం వీఆర్వో ముంగ‌ర వెంక‌ట ర‌మ‌ణ‌య్య‌, చిట్ట‌మూరు ఎమ్మార్వో కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న స‌బార్డినేట్ మారుబోయిన ప్ర‌సాద్ ల‌ను కూడా స‌స్పెండ్ చేశారు. గ‌తంలో చంద్ర‌శేఖ‌ర్ చిట్ట‌మూరు ఎమ్మార్వో కార్యాల‌యంలో త‌హ‌సీల్దారుగా చేశారు. ఆ స‌మ‌యంలో ప్ర‌భుత్వ భూముల‌కు ప‌ట్టాలు ఇప్పిస్తాన‌ని నాగార్జున అనే వ్య‌క్తి నుంచి కోటిన్న‌ర రూపాయ‌లు లంచం తీసుకున్నాడ‌ని ఇటీవ‌ల ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. చిట్ట‌మూరు నుంచి సైదాపురం మండ‌లానికి బ‌దిలీ కావ‌డంతో భూ ప‌ట్టాల విష‌యం అట‌కెక్కింది. అయితే లంచం తీసుకుని ఆ మొత్తాన్ని ఇవ్వ‌క‌పోవ‌డం, ప‌ట్టాలు ఇప్పించ‌క‌పోవ‌డంతో బాధితుడు నాగార్జున కొన్నిరోజుల క్రితం క‌లెక్ట‌రేట్ వ‌ద్ద భార్యాబిడ్డ‌ల ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మ‌హ‌త్య య‌త్నానికి పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. అక్క‌డే వున్న క‌లెక్ట‌రేట్ సిబ్బంది, పోలీసులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మై బాధితుడిని కాపాడారు. డీఆర్వో మ‌ల్లికార్జున స్వ‌యంగా వ‌చ్చి బాధితుడిని ప‌రామ‌ర్శించి, వివ‌రాలు సేక‌రించారు. అనంత‌రం క‌లెక్ట‌రుకు నివేదిక అంద‌చేయ‌డంతో ఎంక్వ‌యిరీ వేశారు. తాజాగా చంద్ర‌శేఖ‌ర్‌, వెంక‌ట ర‌మ‌ణ‌య్య‌, ప్ర‌సాద్ ల‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

* దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. వరుసగా మూడో రోజు కొత్త కేసుల సంఖ్య 16వేలకు పైనే ఉంది. అయితే ఇందులో 86శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో కొత్త కేసులు పెరిగినట్లు తెలిపింది.

* వైసీపీ నేతల భూఆక్రమణ నెల్లూరులోని నక్కాగోపాల్ నగర్‌లో వెలుగు చూసింది.రూ.7.2 కోట్ల విలువైన భూమిని ఆక్రమించి వైసీపీ నేతలు వెంచర్ వేశారు.గతంలో నివాసయోగ్యం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది.అప్పట్లో పేదల ఇళ్లని అధికారులు తొలగించారు.వెంచర్‌లో హద్దురాళ్లని స్థానికులు తొలగించారు.భూముల జోలికి వెళ్తే కేసులు పెడతానంటూ ఎస్ఐ లక్ష్మణరావు బెదిరింపులకు పాల్పడ్డారు.ఎస్‌ఐ బెదిరింపుల ఆడియోలు మీడియా చేతికి చిక్కాయి.

* నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు వాహన తనిఖీలు. విశాఖ ఏజెన్సీ నుండి ప్లాస్టిక్ డ్రమ్ముల మాటున లారీలో తరలిస్తున్న 300 కేజీల గంజాయిని పట్టుకొని హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి నర్సీపట్నం పోలీస్ స్టేషన్ కు తరలింపు.

* కర్ణాటక హోస్పేట్​లో దారుణం జరిగింది. నడిరోడ్డుపై అందరు చూస్తుండగానే ఓ న్యాయవాది, కాంగ్రెస్​ నాయకుడు తారిహళ్లి వెంకటేశ్​(48)ను నడిరోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపాడు అతడి బంధువు.