Politics

పంచాయతీ ఎన్నికల్లో 27శాతం ఓట్లు వచ్చాయి. మార్పు మొదలైంది.

పంచాయతీ ఎన్నికల్లో 27శాతం ఓట్లు వచ్చాయి. మార్పు మొదలైంది.

పంచాయతీ ఎన్నికల్లో జనసేన 27శాతం ఓట్లు సాధించిందని ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద నాలుగు దశల్లో కలిపి జనసేన భావజాలం, మద్దతుతో పోటీ చేసిన వారు 1,209 సర్పంచి పదవులు గెలుచుకున్నారని అన్నారు. 1,776 ఉప సర్పంచి పదవులు, 4,456 వార్డుల్లో గెలవడం సంతోషాన్ని ఇచ్చిందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 65శాతం పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచామన్నారు. ఉభయగోదావరి జిల్లాలో 80శాతం పంచాయతీలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 71శాతం పంచాయతీల్లో ద్వితీయ స్థానంలో నిలిచినట్లు వివరించారు. జనసేనకు వచ్చిన ఈ విజయం మార్పునకు సంకేతమని పేర్కొన్నారు.