Movies

సన్ ఆఫ్ ఇండియాలో మీనా

సన్ ఆఫ్ ఇండియాలో మీనా

తెలుగు చిత్రసీమలో డైలాగ్‌ కింగ్‌గా పేరొందిన నటుడు మోహన్‌బాబు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఈ చిత్రంలో సీనియర్‌ కథానాయిక మీనా నటించనుందని సమాచారం. ఇందులో ఆమెది కీలక పాత్ర అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యాజైశ్వాల్ మరో కీలక పాత్రలో‌ నటిస్తోంది.