DailyDose

వెలగపూడిపై చెలరేగిన విజయసాయి-నేరవార్తలు

Crime News - Vijayasai Reddy Speaks Sensations On Velagapudi

* టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిపై విజయసాయిరెడ్డి ఘాటైన వ్యాఖలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ హంతకుడని ఆయన ఆరోపించారు. విజయవాడలో హత్యచేసి విశాఖకు పారిపోయి వచ్చాడని ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖను పరిపాలన రాజధాని కాకుండా ఎమ్మెల్యే వెలగపూడి అడ్డుకుంటున్నాడని వ్యాఖ్యానించారు. వెలగపూడి నుంచి సమస్యలు వస్తే ఫిర్యాదు చేయాలని, విశాఖ నుంచి తరిమికొడదామని విజయసాయిరెడ్డి సూచించారు.

* ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనడంపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సీరియస్‌‌గా తీసుకున్నారు. రాజకీయ ప్రక్రియలో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని రమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థుల తరపున ఓటర్లను ప్రభావితం చేయకూడదని సూచించారు. ఓటు వేయకపోతే ప్రభుత్వ పథకాలు వర్తించవని బెదిరించకూడదని తెలిపారు. ఓటర్ స్లిప్పులను వాలంటీర్ల ద్వారా పంపిణీ చేయొద్దన్నారు. వాలంటీర్ల కదలికను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వాలంటీర్ల ఫోన్లను సేఫ్ కస్టడీలో పెట్టాలని సూచించారు. ఎన్నికలకు వాలంటీర్లను ఉపయోగించడం కోడ్‌ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. వాలంటీర్లు దైనందిన విధులు నిర్వహించడంలో అభ్యంతరం లేదన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు ఎస్‌ఈసీ సర్క్యూలర్ పంపారు.

* మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పోటీ పడలేక వైసీపీ శ్రేణులు ఆస్తుల విధ్వంసానికి దిగడం సిగ్గుచేటని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు మండిపడ్డారు.

* దేశ రాజధాని దిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.ఓ మహిళ(25)ను కిరాతకంగా కత్తితో పొడిచి చంపాడో దుండగుడు.శనివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఆమె మార్కెట్​ నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయివాయవ్య దిల్లీలోని ఆదర్శ్​ నగర్​లో ఓ గొలుసు దొంగ.. మహిళ మెడలోని చైన్​ను దొంగిలించడానికి యత్నించాడు.ప్రతిఘటించిన ఆమెపై కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీవ్రగాయాలపాలైన ఆమె మృతిచెందింది.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఎఫ్​ఐఆర్​ నమోదు చేసిన పోలీసులు.. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.