Movies

18ఏళ్లకు తొలిముద్దు. సైఫ్‌తో ప్రేమ.

18ఏళ్లకు తొలిముద్దు. సైఫ్‌తో ప్రేమ.

పరిణీతి చోప్రా తాజాగా ‘డూ యూ రిమెంబర్‌’ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. ఫస్ట్‌ కిస్‌, డేట్‌ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ డేట్‌కి వెళ్లలేదు. 18 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఒకర్ని ముద్దు పెట్టుకున్నాను. అదే నా తొలిముద్దు.’ అని అన్నారు. చిన్నతనంలో ఉన్నప్పుడు సైఫ్‌ అలీఖాన్‌ను తాను ఎంతగానో ప్రేమించానని పరిణీతి తెలిపారు. అంతేకాకుండా తాను కథానాయికగా నటించిన తొలి సినిమా ‘లేడీస్‌ వర్సెస్‌ రిక్కీబాల్‌’ విడుదలైన తర్వాత ఓ అభిమాని నుంచి ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ తనకి అందిందని.. ఓ పుస్తకం అందులో అన్నీ లేఖలే ఉన్నాయని.. ఆమె తెలిపారు. అంతేకాకుండా ఆ గిఫ్ట్‌ తనకి ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని ఆమె అన్నారు.