Devotional

కోటప్పకోండపై శివరాత్రికి ఆంక్షలు లేవు-TNI ఆధ్యాత్మిక వార్తలు

కోటప్పకోండపై శివరాత్రికి ఆంక్షలు లేవు-TNI ఆధ్యాత్మిక వార్తలు

* సూర్యుని ద్వాదశ రూపాలు.1. ఇంద్రుడు :స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు.2. ధాత :ప్రజాపతియై భూతములను సృష్టించాడు.3. పర్జన్యుడు:తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.4 త్వష్ట :ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.5. పూష :ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.6. అర్యముడు :దేవతారూపంలో వుంటాడు.7. భగుడు :ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.8. వివస్వంతుడు :ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు.9.విష్ణువు :శత్రువులను నాశనం చేస్తాడు.10.అంశుమంతుడు :గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.11. వరుణుడు :జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.12. మిత్రుడు :లోకాాలలో మేలుచేస్తూ… చైతన్యాన్ని కలిగిస్తాడు.శుభ సూర్యోదయం

* శివరాత్రిని పురస్కరించుకుని నరసరావుపేటలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ తిరునాళ్లలో ప్రభలు కట్టవద్దనే ఆంక్షలు విధించలేదని గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ స్పష్టం చేశారు. గుంటూరులో నిర్వహించిన మీడియ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభల ఏర్పాటు అనుమతిపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. ఏటా సంప్రదాయబద్ధంగా ఏర్పాటు చేసే ప్రభలపై ఆంక్షలు విధించలేదన్నారు. ఎన్నికల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తలు చేపట్టాలని.. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రజలు తిరునాళ్లు జరుపుకోవచ్చని ఎస్పీ తెలిపారు. మతాచారాలకు సంబంధించి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు.

* ఓం నమో వేంకటేశాయతిరుమల సమాచారం(28-02-2021)? నిన్న ఫిబ్రవరి 27 వ‌ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 56,210 మంది…‌ ‌? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 3.30 కోట్లు.? నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 28,017 మంది…? తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేస్తున్న టిటిడి…?‌ అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో పరిమిత సంఖ్యలో టోకన్లు ఇస్తున్న టిటిడి.