Health

మీకు కిడ్నీ వ్యాధి ఉందా?

How to beat kidney failure with treatment?

భారతదేశంలో అత్యంతప్రమాదకరంగా పరిణమిస్తున్న వ్యాధి కిడ్నీల వైఫల్యం. ఇటీవలి కాలంలో కిడ్నీఫెయిల్యూర్స్‌ ఆందోళన కలిగించే స్థాయిలో నమోదవుతున్నాయి. ఆధునిక వైద్యప్రక్రియలు ఎన్ని వచ్చినా.. కిడ్నీ ఫెయిల్యూర్‌ను అధిగమించి సంపూర్ణఆరోగ్యవంతులైన వారు అరుదుగానే కనిపిన్నారు. అయితే కిడ్నీ వ్యాధులకుఆయుర్వేదం, హోమియోపతి వెద్యులు పునర్నవను మంచి ఔషధంగా సూచిస్తున్నారు. మనపల్లెల్లో పొలాల వెంబడి కనిపించే తెల్ల గలిజేరు కూర ను పునర్నవ అనిపిలుస్తారనే విషయం చాలా మందికి తెలియదు. పేరుకు తగ్గట్టే పునర్నవ కిడ్నీవ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో, హోమియోపతిలో పునర్నవమందులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. తెల్ల గలిజేరుగా పేరున్న పునర్నవతరుచూ మన వంటకాల్లో వాడటం వల్ల కిడ్నీ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఈ ఆకుకూరరుచిలో కూడా మేటిగా ఉంటుంది. పప్పుల్లో, పొడికూరగా గలిజేరు కూరను వాడటంమంచిది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ కూరను తరచూ తీసుకోవడం వల్ల షుగర్‌నియంత్రణలో ఉంటుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.