DailyDose

విజయవాడలో డ్రగ్ మాఫియా కలకలం-నేరవార్తలు

విజయవాడలో డ్రగ్ మాఫియా కలకలం-నేరవార్తలు

* ఏపీలో డ్రగ్ మాఫియా కలకలం.మందు బిళ్లల మాటున నకిలీ డ్రగ్స్ అంటగడుతున్నట్టు గుర్తింపు.విజయవాడ, పాలకొల్లు కేంద్రంగా రాష్ట్రంలో సరఫరా.డ్రగ్స్ ఐజీ రవిశంకర్ నేతృత్వంలో ప్రత్యేక బృందాల ఏర్పాటు.అన్ని మెడికల్ షాపుల్లో తనిఖీలకు ఆదేశాలు.

* రెండు గ్రామాల మధ్య ఘర్షణ కు దారి తీసిన పబ్జి గేమ్..నూజివీడులో విద్యార్థులు మధ్య పబ్జి వివాదం.కాలేజి బస్సులోనే ఘర్షణకు దిగిన విద్యార్థులు.రెండు గ్రామాల మధ్య దారితీసిన విద్యార్థులు మధ్య ఘర్షణ..కొత్తూరు తండా, సిద్దార్థ నగర్ గ్రామాల మధ్య గొడవ..గాయపడ్డ ఇరువర్గాలకు చెందిన కొంతమంది…బాధితులను నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు..ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

* పెనమలూరు ప్రభుత్వ వైద్యుడిపై లైంగిక వేధింపుల కేసు.కంకిపాడులో ప్రభుత్వ వైద్యుడుపై లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది.డాక్టర్ శివరామ కృష్ణ మొవ్వ గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తూ ఈడుపుగళ్ళు గ్రామంలో సొంత క్లినిక్ నడుపుతన్నారు.ఈ క్రమంలో వైద్యం కోసం వచ్చిన ఈడుపుగల్లుకు చెందిన వివాహితతో డాక్టర్ అసభ్యకంగా ప్రవర్తించారు.దీంతో వివాహిత పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

* ఒడిశా నుంచి విశాఖకు భారీ ఎత్తున తరలిస్తున్న డబ్బు సంచులను స్వాధీనం చేసుకొని ఓ ముఠాను ఒడిశా పోలీసులు అరెస్ట్‌ చేశారు.ఈ డబ్బు మొత్తం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంకు తరలిస్తున్నట్లుగా తమ విచారణలో గుర్తించారు.ఒడిశా రాష్ట్రం కొరాపుట్‌ జిల్లా పొటాంగి పరిధిలోని సుంకీ అవుట్‌ పోస్టు వద్ద మంగళవారం పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా ఓ కారును చెక్ చేయగా పోలీసులకు మతిపోయినంత పనైంది.కారులో కొన్ని బస్తాల్లో రూ. 500 నోట్ల డబ్బు కట్టలు లభించాయి.అయితే ఇవి నకిలీ కరెన్సీగా పోలీసులు తేల్చారు.ఈ నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు కోరాపుట్‌ ఎస్పీ గుంటుపల్లి వరుణ్‌ తెలిపారు.ఈ ముఠా సబ్యుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.ఓడిశా పోలీసులు డబ్బు మొత్తం నకిలీ నోట్లుగా తేలింది.

* అనూష కుటుంబానికి పరామర్శ.ఇటీవల ప్రేమోన్మాది ఘాతుకానికి బలైన.. ముప్పాళ్ల మండలం, గోళ్లపాడు గ్రామ వాసి కోటా అనూష.. కుటుంబాన్ని ఈరోజు నరసరావుపేట పార్లమెంట్‌ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు గారు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ గారు పరామర్శించారు.అనూష తల్లి దండ్రులైన.. కోటా ప్రభాకర్, వనజాక్షిలను కలసి మనోధైర్యాన్ని నింపారు.అనూషపై జరిగిన అఘాయిత్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.నిందుతునికి కఠిన చర్యలు పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.అనూష కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల సాయాన్ని ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందించారు.ఇటువంటి ఘటనలు జరగకూడదనే.. ప్రభుత్వం దిశా చట్టం ప్రవేశపెట్టిందని తెలిపారు.