Movies

ఇది మసాల కాదు బాబు…

Poorna Clarifies About Backdoor Movie - Tollywood News

“బ్యాక్‌డోర్‌’ అనే టైటిల్‌ చూసి చాలా మంది మసాలా సినిమా అని అపోహపడుతున్నారు. టైటిల్‌ ఆధారంగా సినిమాపై నిర్ణయానికి రావద్దు. మంచి సందేశంతో తెరకెక్కిన చిత్రమిది’ అని చెప్పింది పూర్ణ. ఆమె కథానాయికగా నటించిన చిత్రం ‘బ్యాక్‌డోర్‌’. కర్రి బాలాజీ దర్శకుడు. బి. శ్రీనివాస్‌రెడ్డి నిర్మించారు. సోమవారం హైదరాబాద్‌లో ఈ చిత్ర టీజర్‌ ఆవిష్కరణ వేడుక జరిగింది. ఈ సందర్భంగా పూర్ణ మాట్లాడుతూ ‘మసాలా సినిమాల్లో నేను నటించను. ఆ అవసరం నాకు లేదు. సమాజంలో జరిగే సంఘటనల్నీ ఆలోచనాత్మకంగా సాగే చిత్రమిది. . కమర్షియల్‌ హంగుల కోసమే కొన్ని గ్లామర్‌ సన్నివేశాల్ని జోడించాం. వాటివల్ల ఇది అడల్ట్‌ సినిమా అనుకోవద్దు. భార్యాభర్తల మధ్య అవగాహన ఉన్నప్పుడే ఆ బంధం సజావుగా సాగుతుందనే పాయింట్‌తో రూపొందిన చిత్రమిది’ అని చెప్పింది. నిర్మాత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ ‘టీజర్‌ ఎమోషనల్‌ సాగింది. అందంగా సినిమాను తెరకెక్కించారు. పూర్ణ చక్కటి నటనను కనబరిచింది’ అని తెలిపారు. లఘు చిత్రాలతో నంది అవార్డును గెలుచుకున్న బాలాజీ ఈ సినిమాతో వెండితెరపై ప్రతిభను చాటుకోవాలని కోన వెంకట్‌ ఆకాంక్షించారు. దర్శకుడిగా తనకు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమవుతుందని కర్రిబాలాజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దామోదరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.