NRI-NRT

తానాకు….సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర

TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile - తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర

గత దశాబ్ద కాలంగా తానాలో యువతరం ప్రాతినిధ్యం గణనీయంగా పెరుగుతూ వస్తోంది. చిన్న వయస్సులోనే ప్రాముఖ్యత కలిగిన తానా పదవుల వైపు యువతరం ఆకర్షితులవుతోంది. తానా కార్యవర్గంలో చోటు కోసం వీరు పోటీ పడుతున్నారు. ఈ పర్యాయం జరుగుతున్న ఎన్నికల్లో చాలా మంది యువకులు యుద్ధభేరి మోగించారు. ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో 2021-23కు సహాయ కోశాధికారిగా(Joint Treasurer) చిత్తూరు జిల్లా ఐరాల మండలం నాంపల్లి గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు, డెట్రాయిట్‌కు చెందిన పంత్ర సునీల్ బరిలో ఉన్నారు. ఆయన తన ఎన్నికల ప్రచారంలో భాగంగా TNIతో మాట్లాడుతూ….2009 తానా చికాగో సభల నుండి సంస్థతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్న తనను గెలిపించి తానా కార్యవర్గంలో మరోసారి చోటు కల్పిస్తే తానా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు టీంస్క్వేర్‌కు లక్ష డాలర్లను తన హయాంలో సేకరించే విధంగా తన సమయాన్ని ఖర్చు చేస్తానని తెలిపారు. దీనితో పాటు తానా నిధుల ప్రవాహంలో అవకతవకలకు ఆస్కారం లేకుండా జవాబుదారీతనం పెంపొందించేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. తానాతో తన అనుబంధం గురించి సునీల్ మాట్లాడారు. ఆ వివరాలు….
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
*** వ్యక్తిగత వివరాలు. డెట్రాయిట్‌తో అనుబంధం:
* డెట్రాయిట్ వంటి మహా నగరంలో వేల సంఖ్యలో తెలుగు వారు గత 50 సం.ల నుండి నివసిస్తున్నారు. వివిధ రంగాల్లో రాటు తేలిన ప్రవాసాంధ్ర ప్రముఖులకు నిలయం డెట్రాయిట్ నగరం. అటువంటి ప్రాంతం నుండి తానా ప్రాంతీయ ఉపాధ్యక్షునిగా 2017లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. అందరినీ కలుపుకుని పెద్ద ఎత్తున సాంస్కృతిక, సేవా, క్రీడా కార్యక్రమాలు నిర్వహించాను.
* నా హైస్కూల్ విద్య చిత్తూరులో, ఇంటర్ నెల్లూరు రత్నంలో, ఇంజనీరింగ్ తిరువన్నామలై ఎస్.కే.పీ.లో పూర్తిచేశాను.
* 2007లో ఉద్యోగరీత్యా డెట్రాయిట్ వచ్చారు. చిన్నతనం నుండి రెడ్ క్రాస్, ఎన్.సీ.సీ, యువజన సర్వీసులు వంటి సంస్థల్లో పనిచేశాను. డెట్రాయిట్ వచ్చిన అనంతరం స్థానిక తెలుగు సంఘం(DTA) శ్రీ వెంకటేశ్వర ఆలయం, షిరిడి సాయి దేవాలయం, తానా స్థానిక విభాగం వంటివాటిలో చురుకైన పాత్ర పోషించాను.
* చిత్తూరు జిల్లాలో తానా తరపున, జిల్లా ప్రవాస తెలుగు సంఘం తరపున పలు సేవా కార్యక్రమాలను చేపట్టడంలో కీలకంగా వ్యవహరించాను.
* నందమూరి బాలకృష్ణకు అభిమాని అయిన నేను తానా సహకారంతో చిత్తూరు జిల్లాలో డిజిటల్ తరగతుల ఏర్పాటు, పేద విద్యార్థులకు సహాయపడటం, గ్రంథాలయాల ఏర్పాటు, కోవిద్ సమయంలో అంతర్జాలం ద్వారా వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా సభ్యులకు కళాకారులను మరింత చేరువ చేయడంలో సఫలీకృతమయ్యాను.
* డెట్రాయిట్ తెలుగు సంఘానికి 2012లో ప్రధాన కార్యదర్శిగా, 2010, 2011లో ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడమే గాక అతి పిన్న వయసులో సంస్థను ప్రవాసులకు చేరువ చేసే కార్యక్రమాలను నిర్వహించినందుకు DTA నుండి వడ్లమూడి వెంకటరత్నం పురస్కారాన్ని అందుకున్నాను.
* కోవిద్ సమయంలో అమెరికా ప్రభుత్వ అత్యవసర ఉద్యోగులకు, ఇబ్బందుల్లో ఉన్న ప్రవాస తెలుగు విద్యార్థులకు నిత్యావసరాలు అందజేసి బాసటగా నిలిచారు.
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
*** తానాతో సుదీర్ఘ అనుభవం:
తానాలో కూడా నేను పలు పదవులు నిర్వహించాను. ధీంతానా సమన్వయకర్తగా, ప్రకటనల విభాగం అధ్యక్షుడిగా, డెట్రాయిట్ తానా మహాసభల ప్రచార విభాగం నాయకుడిగా, ఎలక్ట్రానిక్ మీడియా చైర్‌పర్సన్‌గా, 2015 డెట్రాయిట్ సభల మీడియా విభాగ అధ్యక్షుడిగా, 2017-19 తానా సాంస్కృతిక సేవల సమన్వయకర్తగా పనిచేసిన నేను తానా ఫౌండేషన్ తరుపున ప్రచార వీడియోలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించాను. ఏపి జన్మభూమి పథకానికి డెట్రాయిట్ సమన్వయకర్తగా వ్యవహరించాను. తానాలో సునీల్ నిర్వహించిన పదవులు…
* 2019-21: సాంస్కృతిక సేవా కార్యక్రమాల సమన్వయకర్త
* 2017-19: ఉత్తర ప్రాంతీయ ప్రతినిధి
* 2015-17: మీడియా విభాగ అధ్యక్షుడు
* 2014-15: తానా 19వ మహాసభల మీడియా కమిటీ అధ్యక్షుడు
* 2011-13: తానా ప్రకటనల విభాగ అధ్యక్షుడు
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
*** 2019-20 మధ్య సునీల్ నేతృత్వంలో చేపట్టిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు:
* 2019 డీసీ సభల్లో తానా సాంస్కృతిక సేవా సమన్వయకర్తగా బాధ్యతల స్వీకరణ.
* అదే ఏడాది అమెరికావ్యాప్తంగా ప్రముఖ అవధాని మేడసాని మోహన్‌చే 20కుపైగా ప్రవచన కార్యక్రమాలు.
* ప్రముఖ రచయిత జొన్నవిత్తులచే అమెరికా అంతటా 10కు పైగా సమావేశాలు.
* అమెరికాపై కోవిద్ పంజా విసిరి ప్రవాసులు గృహాలకే పరిమితం అయిన కాలంలో వారిని అలరించేందుకు అంతర్జాలం ద్వారా దేవిశ్రీ, థమన్, అనీల్ రావిపూడి వంటి సినీ సంగీత దర్శకులతో సంగీత విభావరి ఏర్పాటు.
* ప్రముఖ గాయనీ శోభారాజుచే రెండు నెలల పాటు 600కు పైగా ప్రవాస చిన్నారులకు సంగీతంలో శిక్షణా తరగతులు. ఈ కార్యక్రమాన్ని చిన్నజీయర్ స్వామిజీ ప్రారంభించారు.
* అమెరికావ్యాప్తంగా 100కుపైగా చిన్నారులు ఈ కార్యక్రమం ద్వారా ఏడాది పొడవునా సంగీత తరగతుల్లో పాఠాలు నేర్చుకుంటున్నారు.
* 20మంది సంగీత కళాకారులతో ఎస్పీ బాలుకు నివాళి పేరిట ఏర్పాటు చేసిన అంతర్జాల కార్యక్రమంలో 50వేలకు ప్రవాసులు పాల్గొని గానగంధర్వుడికి నివాళులర్పించారు.
* స్థానిక ప్రాంతీయ ప్రతినిధి కిరణ్ దుగ్గిరాలతో కలిసి సీపీఆర్, క్రీడాపోటీలు నిర్వహణ.
* కోవిద్ సమయంలొ తానా కేర్స్ ఛైర్మన్ పెద్దిబోయిన జోగేశ్వరరావు సహకారంతో $6000 విలువైన ఆహారాన్ని తానా-మిషిగన్ విభాగం పంపిణీ.
* కళాకారులకు కోవిద్ సమయంలో ఆర్థికంగా బాసట.
* అంతర్జాలంలో నిర్వహించిన బాలోత్సవానికి సహకారం.
* గత జులైలో నిర్వహించిన సాంస్కృతికోత్సవానికి 40దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సమన్వయకర్తగా తోడ్పాటు.
* సెప్టెంబర్ 2020లో రామాచారి, డా.వైసరాజు సుబ్రహ్మణ్యంల నేతృత్వంలో తెలుగు డిజిటల్ ఐడల్ పోటీల నిర్వహణ. 1000మంది పాల్గొన్న ఈ పోటీల్లో ముగ్గురు తుది పోటీదారులకు తానా తరఫున బహుమతుల ప్రదానం.
* డిసెంబరు 2020లో అమెరికావ్యాప్తంగా ఉన్న 12 స్థానిక తెలుగు సంఘాలతో కలిసి 12 సురభి నాటకోత్సవాలను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర.
* 2017-19 Activities Conducted By Sunil Pantra (https://www.tnilive.com/?p=6630)
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర
తన తానా సేవా కార్యక్రమాల వెనుక అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, కార్యదర్శి పొట్లూరి రవిల సహకారం విలువైనదని, తనకు సహాయ కోశాధికారిగా అవకాశం కల్పిస్తే తానా ద్వారా మరోసారి తన సత్తా చాటుతానని సునీల్ అంటున్నారు. ముఠాతత్వాలకు వ్యతిరేకంగా…అజాతశత్రువుగా తానాలో దీర్ఘకాలంగా సుపరిచితుడైన సునీల్ గెలుపు తానాలో కీలకం కానుంది.
TANA Joint Treasurer 2021-23 Candidate Sunil Pantra Profile-తానాకు....సంపద సృష్టిస్తా. సమయాన్ని వెచ్చిస్తా-TNIతో సునీల్ పంత్ర