NRI-NRT

నిరంజన్ ప్యానెల్‌కు మరో ఇద్దరి మద్దతు

నిరంజన్ ప్యానెల్‌కు మరో ఇద్దరి మద్దతు

2021 తానా ఎన్నికల్లో పూటకో సమీకరణం మారుతోంది. బుధవారం సాయంత్రం క్యాపిటల్ ప్రాంతీయ ప్రతినిధిగా వుయ్యూరు శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికై నిరంజన్ ప్యానెల్‌కు మద్దతు ఇచ్చిన విషయం మర్చిపోకముందే తాజాగా ఫౌండేషన్ ట్రస్టీగా బరిలో ఉన్న మలినేని ఠాగూర్ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని నిరంజన్ ప్యానెల్‌కు మద్దతు ప్రకటించారు. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఠాగూర్ 2002 నుండి అమెరికాలో ఉంటున్నారు. గత 6 ఏళ్లుగా నార్త్ కరోలీనాలోని షార్లెట్ నగరంలో స్థిరపడ్డారు. ఆయనకు ఈ ప్రాంతంతో పాటు అమెరికావ్యాప్తంగా రాజకీయంగా, వ్యక్తిగతంగా పలువురు తానా సభ్యులతో కీలక సంబంధాలు ఉన్నాయి. ఈయనతో పాటు వర్జీనియాలోని హెర్న్‌డన్‌కు చెందిన నామినేషన్ ఉపసంహరించుకున్న మరో అభ్యర్థి మేకా సతీష్ కూడా నిరంజన్ ప్యానెల్‌కు మద్దతు తెలిపారు. ఎన్నికల సమయంలో వీరు ఇరువురు నిరంజన్ ప్యానెల్‌కు(#TANA4Change) బహిరంగంగా మద్దతు పలకడం ఆ ప్యానెల్‌కు లాభించే విషయమని తానా సభ్యులు, నేతలు భావిస్తున్నారు.
TANA 2021 Elections Niranjan Sringavarapu Panel - TNILIVE
TANA 2021 Elections Kodali Naren Panel - TNILIVE
TANA 2021 Elections Kolla Ashok For Treasurer 2021-2023 - TNILIVE
TANA 2021 Elections Raja Kasukurthi For Community Services Coordinator - TNILIVE
TANA 2021 Elections Jagadish Prabhala For Treasurer 2021-23 - TNILIVE
TANA 2021 Elections Murali Talluri For Joint Secretary 2021-23 - TNILIVE
TANA 2021 Elections Raja Surapaneni For Foundation Trustee 2021-2025 - TNILIVE
TANA 2021 Elections Gude Purushottama Chowdary For Foundation Trustee 2021-2025 - TNILIVE