Movies

రీమేక్‌లో ఫాతిమా

Fatima Sana Shaikh To Star In Tamil Remake

‘దంగల్‌’ చిత్రంలో ఆమీర్‌ఖాన్ కుమార్తెగా నటించి అలరించిన కథానాయిక ఫాతిమా సనా షేక్‌. తెలుగులో ‘నువ్వు నేను ఒక్కటవుదాం’ అనే చిత్రంలోనూ నటించింది. ప్రస్తుతం ఆమె హిందీలో తెరకెక్కుతున్న ‘అరువి’ అనే తమిళ రీమేక్‌లో నటిస్తున్నారు. హిందీలో రీమేక్‌ అవుతున్న ఈ చిత్రానికి ఇ.నివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫెయిత్‌ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వి.కి. రజనీ నిర్మాత. సినిమా పేరు ఇంకా ప్రకటించలేదు. ఈ ఏడాది మధ్యలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి చిత్ర నిర్మాతలు ట్విటర్‌ వేదికగా ఫాతిమాతో కలిసి దిగిన గ్రూఫ్‌ ఫొటోను షేర్ చేశారు. దర్శకుడు ఇ.నివాస్‌ గతంలో రామ్ గోపాల్‌వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. హిందీలోనూ కొన్ని చిత్రాలకి దర్శకత్వం వహించారు. ఫాతిమా గతేడాది అనురాగ్‌ బసు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లుడో’ చిత్రంలో పింకీ జైన్‌గా నటించి మెప్పించింది.