DailyDose

మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి-నేరవార్తలు

మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి-నేరవార్తలు

* మెదక్ జిల్లాలో మహిళపై యాసిడ్ దాడి.అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే ఓ మహిళపై యాసిడ్ దాడి జరిగిన ఘటన తెలంగాణ.. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్​లో చోటుచేసుకుంది.టేక్మాల్ మండలం అంతాయిపల్లి తండాకు చెందిన మహిళపై సోమవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఆసిడ్​తో దాడి చేశాడు.గమనించిన స్థానికులు బాధితురాలిని హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి గురించి స్థానికుల్ని ఆరా తీశారు.వీలైనంత త్వరలో ఘటనకు కారణమైన వారిని పట్టుకుంటామని తెలిపారు.

* దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్’​ కేసులో ఇండియన్​ ముజాహిదీన్​ వ్యక్తిని దోషిగా తేల్చింది దిల్లీ కోర్టు.2008లో జరిగిన ఈ ఘటనలో ఇన్​స్పెక్టర్​ మోహన్​ చంద్​ శర్మ(ఎంసీ శర్మ)ను అరిజ్​ ఖాన్​, అతని సహచరులు హత్యచేసినట్టు సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని అదనపు సెషన్స్ న్యాయమూర్తి సందీప్​ యాదవ్​ తెలిపారు.అయితే.. నిందితుడికి ఏ శిక్ష వేయాలనేదానిపై ఈ నెల 15న విచారణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.2008లో.. దిల్లీలో ఇండియన్​ ముజాహిదీన్​ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో.. జామియా నగర్​లోని బాట్లా హౌస్​ ప్రాంతంలో దిల్లీ పోలీసులు కాల్పులు జరిపారు.పోలీసులపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడం వల్ల.. ఇన్​స్పెక్టర్​ ఎంసీ శర్మ అమరుడయ్యారు.

* నిషేధిత గంజాయిని తరలిస్తుండగా జిల్లాలోని సీలేరు పోలీసులు పట్టుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి మండలం దారకొండ నుంచి హైదరాబాదుకు కారులో గంజాయి ప్యాకెట్లు తరలిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందిందన్నారు.దీంతో సీలేరు జెన్ కో చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను సీలేరు పోలీసులు చేపట్టారు.వాహన తనిఖీల్లో కారులో తరలిస్తున్న గంజాయి ప్యాకెట్లు పట్టుబడ్డాయి.దాదాపు 56 కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గంజాయి ప్యాకెట్లను తరలిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

* తెలంగాణ రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న 10 లక్షల రూపాయల విలువైన మద్యం సీజ్ చేసిన నరసరావుపేట ఎస్.ఇ.బి అధికారులు.

* ఓ ప్రాంతంలో బంగారు గని  బయటపడింది. దీంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని తవ్వకాలు చేపట్టారు.విషయం తెలుసుకున్న అక్కడి ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించింది.దక్షిణ కివు ప్రావిన్స్‌లోని కొండల్లో ఒక చోట ఇటీవల బంగారు గనిని గుర్తించారు.దీంతో పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు పలుగు, పారలతో పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.గనిని తవ్వి బంగారంతో కూడిన మట్టిని సంచులు, తట్టల్లో ఇళ్లకు తీసుకువెళ్లారు.అనంతరం నీటితో మట్టిని కడిగి అందులోని చిన్న చిన్న బంగారు రాళ్లను సేకరించారు.మరోవైపు ఈ విషయం ఆ దేశ పాలకులు, అధికారుల దృష్టికి వెళ్లింది.లుహిహిలో బంగారం అధికంగా ఉన్న ధాతువును కనుగొన్నట్లు కివు ప్రావిన్స్‌కు చెందిన గనుల మంత్రి ధృవీకరించారు.దీంతో పరిసర గ్రామాల ప్రజలు అక్కడకు వెళ్లి బంగారం ధాతువును సేకరిస్తున్నారని తెలిపారు.ఈ నేపథ్యంలో మైనింగ్ కార్యకలాపాలను నిలిపివేయాలని డిక్రీ జారీ చేశారు.

*