NRI-NRT

సంగీత సాహిత్య సమలంకృతే…తానాకు బలం తెలుగు సంస్కృతే!-TNIతో తూనుగుంట్ల శిరీష

TANA Elections 2021 Cultural Services CoOrdinator Candidate Tunuguntla Sirisha

తెలుగు సంగీత సాహిత్యాలకు విస్తృత ప్రచారం కల్పిస్తూ సేవా రంగంలో సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న తానాకు తెలుగు సంస్కృతే నిజమైన బలమని 2021 ఎన్నికల్లో సాంస్కృతిక సేవా కార్యక్రమాల సమన్వయకర్తగా పోటీలో ఉన్న తూనుగుంట్ల శిరీష TNIతో అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా TNIతో ఆమె పలు విషయాలను పంచుకున్నారు. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్‌గా వినుతికెక్కిన మన భాషను పరిరక్షించుకోవడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో పురుడు పోసుకున్న ఎన్నో జానపద ప్రక్రియలను, లలిత, శాస్త్రీయ సంగీత పద్ధతులను, సరికొత్త నృత్యరీతులను, చేనేత రంగాలను తానా ద్వారా మరింత మందికి చేరువ చేయడమే తన లక్ష్యమని అన్నారు. తెలుగు బతకాలంటే భావితరానికి బదిలీ కావల్సిందేనని, తనను గెలిపించి అవకాశం కల్పిస్తే అమెరికాలో పుట్టి పెరిగిన యువతకు తెలుగు భాష పట్ల మక్కువ పెంచే కార్యక్రమాలకు రూపకల్పన చేస్తానని ఆమె తెలిపారు. #TANA4CHANGE నినాదంతో ఈ ఎన్నికల ద్వారా సరికొత్త మార్పును తీసుకురావాలనే ఉద్దేశంతో పోటీ చేస్తున్న అధ్యక్ష అభ్యర్థి శృంగవరపు నిరంజన్ ప్యానెల్‌తో కలిసి పనిచేయడం తనకు గర్వకారణంగా ఉందని శిరీష అంటున్నారు. తానాను బలోపేతం చేయడం అంటే తెలుగు సంస్కృతిని బలోపేతం చేయడమేనని…శిరీషకు ఓటు వేయడం అంటే తెలుగు సంస్కృతికి ఓటు వేయడమేనని తానా సభ్యులు భావిస్తున్నారు.
సంగీత సాహిత్య సమలంకృతే...తానాకు బలం తెలుగు సంస్కృతే!-TNIతో తూనుగుంట్ల శిరీష-TANA Elections 2021 Cultural Services CoOrdinator Candidate Tunuguntla Sirisha
ప్రపంచవ్యాప్తంగా 40దేశాల్లోని 100సంస్థలను సమన్వయపరిచి ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు ప్రత్యేకంగా అందుకున్న శిరీష స్వస్థలం తెలంగాణాలోని కొత్తగూడెం. గుంటూరు జిల్లా తెనాలి కోడలు అయిన ఆమె ఉన్నత చదువులకు 2005లో అమెరికాకు వచ్చి ప్రస్తుతం న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. 2014లో తొలిసారిగా కమ్యూనిటీ సర్వీసెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి తానాతో అనుబంధాన్ని ఏర్పరుచుకున్న ఆమె సభ్యత్వ కమిటీలో సైతం పని చేశారు. గత రెండేళ్లల్లో తానా మహిళా విభాగ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆమె 100మందికి పైగా సమస్యలను ఎదుర్కొంటున్న మహిళలకు బాసటగా నిలిచారు. అమ్మా నీకు వందనం, బంగారు బతుకమ్మ, సురభి నాటకోత్సవం, కోవిద్ సమయంలో తానా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు, పర్యవరణ హిత వినాయక చవితి వేడుకలు వంటివాటిని నిర్వహించి తానా స్థాయిని తారాస్థాయికి తీసుకుని వెళ్లారు.
సంగీత సాహిత్య సమలంకృతే...తానాకు బలం తెలుగు సంస్కృతే!-TNIతో తూనుగుంట్ల శిరీష-TANA Elections 2021 Cultural Services CoOrdinator Candidate Tunuguntla Sirisha
ఆమె ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, జీవిత విశేషాలు, తదుపరి ప్రణాళికలను దిగువ చూడవచ్చు….

* ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఐక్యరాజ్యసమితితో కలిసి రెండు తెలుగు రాష్ట్రాల గవర్నర్ల తో పాటు అమెరికాలోని పెద్దలను ఆహ్వానించి ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.
* “ప్రపంచ సాంస్కృతిక మహోత్సవం” అనే పేరుతో 40 దేశాలలోని వంద సంస్థలతో కలిసి, 400 వందల మంది వాలంటీర్లతో, 400 మంది జడ్జిలతో, 20 వేల మందితో పోటీలను నిర్వహించారు. మూడు నెలల పాటు ఆమె ఈ కార్యక్రమం కోసం అహోరాత్రులు శ్రమించారు.
* టీచర్స్ డే, బంగారు బతుకమ్మ, సురభి నాటకోత్సవాలు నిర్వహించి కళాకారులు ప్రోత్సహించటం, భారతీయం 20 20, ఫ్రంట్లైన్ లంచ్, ఎ కో గణేష్ 2020, లక్కీ మహిళ 2020 వంటి కార్యక్రమాల నిర్వహణ.
* Helped women in 90+domestic violence issues
* జన్మనిచ్చిన తల్లిని స్మరిస్తూ, గౌరవిస్తూ,” అమ్మా! నీకు వందనం! ” (International mothers day)
* తెలంగాణ సంస్కృతి కి పట్టాభిషేకం చేస్తూ “బంగారు బతకమ్మ” సంబరాలు(Bangaru Bathukamma)
* యువతలో సాంస్కృతిక స్పృహను పెంచడానికి “యంగ్ తరంగ్” – KL University, Vijayawada, India (Young Tarang-2020)
* ‘ఆర్యోక్తి ఆచార్య దేవోభవ’ అన్న అర్ధాన్ని గౌరవిస్తూ “గురువందనం”(Teachers day)
* జాతిపిత పూజ్య బాపూజీ సంస్మరణార్ధం “గాంధీ జయంతి” (October 2nd)
* సురభి నాటక కళను ప్రోత్సహించాలని” సురభి నాటకోత్సవాలు ” (Surabhi Drama fest)
* మహిళ చేతనకు చిహ్నంగా “లక్కీ మహిళ ” (Lucky Mahila)
* శారీరిక మానసిక ఆరోగ్యానికి “యోగ సాధన” (Yoga practice sessions)
* వినాయక చవితి సందర్భంగా “ Eco Ganesha” ఏర్పాటు
* Covid-19 బారిన పడిన వారికి తానా ఫౌండేషన్ పక్షాన చేయూత కార్యక్రమాలు(ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో)
* ఫ్రంట్ లైనర్స్ కి Mothers day సందర్భంగా ఆహార వితరణ
* చేనేత కార్మికుల శ్రమను తగ్గించే ” ఆసు యంత్రాల పంపిణీ”
* విద్యార్థినులకు,వలస మహిళా కూలీలకు సానిటరీ నాప్కిన్స్ పంపిణి.
* డిజిటల్ స్కూల్స్ ఏర్పాట్లు
* CPR & AED శిబిరాల నిర్వహణ
* కాన్సర్ బాధితులకు సహాయం
* కళాకారులకు ఆర్థిక చేయూత