NRI-NRT

ఖతార్ తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం

Qatar Telugu NRI NRT News - Womens Day By Telangana Jagruti Qatar

తెలంగాణ జాగృతి ఖతార్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు.

కోవిడ్ నేపథ్యంలో జూమ్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఖతర్ లోని భారత రాయబార కార్యాలయం కార్యదర్శి (రాజకీయ & సమాచార) శ్రీమతి పద్మ కర్రి గారు, గౌరవ అతిథిగా ఐసిసి అధ్యక్షుడు శ్రీ పిఎన్ బాబు రాజన్ గారు హాజరయ్యారు. ఐసిసి జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్ బంధకవి, ఐసిబిఎఫ్ కోశాధికారి కుల్దీప్ కౌర్ బహల్ గారు, ఐసిబిఎఫ్ వైద్య సహాయ మరియు శిబిరాల ఇంచార్జి రజనీ మూర్తి గారు, విద్యావేత్త మరియు సీనియర్ తెలుగు ప్రవాస నాయకులు ప్రసాద్ రావు కొడూరు గారు, ఖతర్ లో మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి. సుస్మితా పట్నాయక్ గారు కూడా విశిష్ట అతిథులుగా హజరయ్యారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుండి వివిధ రంగాల్లో చరిత్ర స్రుష్టించి ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలిచిన మహిళా విజేతలు అతిథి ప్రసంగించారు ప్రపంచంలో నే అతి చిన్న వయసులో మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణా మాలావత్, ఖతర్ రేడియో జాకీ, మీడియా నిపుణురాలు అను శర్మ, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ప్రాచీ వర్ష్నీ ,తెలంగాణ నుండి మొదటి లైన్ఉమన్ శిరిషా బబ్బూరి, రాష్ట్రంలో మొదటి మహిళా మెకానిక్ ఆదిలక్ష్మి, కువైట్ నుండి ఏకైక మహిళా ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ అభిలాషా గోడిశాల వక్తలుగా విచ్చేసి తోటి మహిళలకు స్ఫూర్తి నిచ్చే వారి ప్రయాణాన్ని,విశేషాల్ని పంచుకున్నారు.

విదేశాల్లో మన సాంప్రదాయం వస్త్రాధరణ అయినటువంటి చీరను ప్రొత్సాహించి, ప్రచారాన్ని కల్పించాలనే సంకల్పంతో’ ‘సంప్రదా, అన్ ఎక్సట్రా ఆర్డినెరీ నారీ ఇన్ సారీ’ అనే శీర్షిక తో ఫాషన్ షొ నిర్వహించారు. కరోనా మహమ్మారి ఆంక్షల కారణంగా జూమ్ ద్వారా జరిగిన ఈ పోటీలో మహిళలు తమ ఇంటి నుండే ర్యాంప్‌ వాక్ చేశసి ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్యోతి ముద్దాం, అధ్యక్షులు తెలంగాణ జాగ్రుతి న్యూజిలాండ్, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ జాగ్రుతి, యుకె మరియు ప్రసిద్ధ విద్యావేత్త శారదా కల్యాణి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీల్లో టైటిల్ విన్నర్ గా ప్రవీణ అక్కిరేడ్డి నిలువగా రాజేశ్వరి రుద్ర మొదటి రన్నరప్, ప్రవీణ టి రెండవ రన్నర్ గా నిలిచారు. అనంతరం మనస్సు, ఆరోగ్యం పెంపొంది, ఒత్తిడి నివారణ కై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తూ జాయ్ ఆఫ్ లివింగ్, మైండ్‌ఫుల్‌నెస్, హెల్త్ అండ్ న్యూట్రిషన్‌ వంటి అంశాలపై నిపుణులు హరికీర్తి గుడిపల్లి, డాక్టర్ అనుషా రెడ్డి, సైరాక్ష సుందరేషన్ గార్లు వర్క్‌షాప్‌లు నిర్వహించారు. సంబరాల్లో సందర్భంగా రాజేష్ రంజని గారు మరియు చిన్నారి అక్షయ కంతేటి పాడి వినిపించిన స్తొత్రాలు, మహిళల పరాశక్తి రూపాల్ని ఆవిష్కరిస్తూ చందన రెడ్డి, రేఖా పోసినా,గౌతమి మొరవనేని, సౌమ్య కంతేటి, తేజస్విని యాచమనేని, పాణ్య సాయివల్లి బ్రుందం చేసిన న్రుత్యరూపకం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగ్రుతి మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు హరికా ప్రేమ్, వంశీ సాయిగిరి, సుధ శ్రీరామోజు, స్వప్న కేసా, స్వప్న అల్లె, మమతా దుర్గాం, ప్రవీణ లక్ష్మి మరియు ఇతర సభ్యులు హాజరయ్యారు.
ఖతార్ తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం