Devotional

శివరాత్రి ప్రత్యేకం-TNI ఆధ్యాత్మిక వార్తా తరంగిణి

శివరాత్రి ప్రత్యేకం-TNI ఆధ్యాత్మిక వార్తా తరంగిణి

* జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాలేశ్వరంలో వెలసిన స్వయంభు పుణ్యక్షేత్రం, సుప్రసిద్ధ అరణ్య శైవక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శుభనంద దేవి ముక్తీశ్వరస్వామి వారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కళ్యాణ వేడుకకు భూపాల పల్లి జిల్లా చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురాగా స్వామివారి కళ్యాణమండపంలో కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. మంగళ వాయిద్యాల నడుమ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వేలమంది భక్తులు తిలకిస్తుండగా అంగరంగ వైభవంగా కళ్యాణ ఘట్టం జరిపించారు. మరోవైపు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమ నదీతీరంలో గోదావరి మాతకి దీపారాధన, ఆలయంలో స్వామి వార్లకు అభిషేకాలతో పాటు శుభనంద దేవి అమ్మవారికి కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు జరిపి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

* మహాశివరాత్రి సందర్బంగా లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్న బాలయ్య దంపతులు.

* తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం మల్లన్న క్షేత్రం, శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరస్వామి ఆలయం, అమరావతిలోని అమరలింగేశ్వరస్వామి ఆలయం,మహానంది, కోటప్పకొండలోని త్రికూటేశ్వరస్వామి ఆలయాలకు వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.శ్రీశైలంలో అర్ధరాత్రి 2 గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి.తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయం, కీసర రామలింగేశ్వరస్వామి ఆలయం, కాళేశ్వరం, రామప్ప ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

* ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.శ్రీగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు.భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు.శ్రీశైలంలో ఇవాళ రాత్రి జాగారం జరుగనుంది.అర్ధరాత్రి పాగాలంకరణ అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం నిర్వహించనున్నారు.అటు పాతాళగంగలో భక్తుల పున్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.మరోవైపు జిల్లాలోని మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ క్షేత్రాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నారు.

* ఓం నమో వేంకటేశాయతిరుమల సమాచారం(11-03-2021)? నిన్న మార్చి 10 వ‌ తేదీన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 54,512 మంది…‌ ‌? నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.74 కోట్లు.? నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 25,496 మంది…? తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకన్లు జారీ చేస్తున్న టిటిడి…?‌ అలిపిరి భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలో మరుసటి రోజులకు పరిమిత సంఖ్యలో టోకన్లు ఇస్తున్న టిటిడి.

* ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున శైవఆలయాలకు పోటెత్తారు.ఈరోజున నాగుపాము కనిపిస్తే మంచిదని చెప్తుంటారు.ఇక శ్వేతనాగు కనిపిస్తే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదని చెప్తుంటారు. మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేటలో కోర్టు సమీపంలో ఉన్న ఓ ఇంటి ఆవరణలో శ్వేతనాగు కనిపించింది.వెంటనే అక్కడి ప్రజలు పూలు, కుంకుమ తీసుకొచ్చి ఆ శ్వేతనాగుకు పూజలు చేశారు. పాలు పోశారు. శ్వేతనాగును దర్శనం చేసుకోవడానికి పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు.పెద్ద ఎత్తున అక్కడికి భక్తులు చేరుకోవడంతో నాగుపాము భయపడింది. అక్కడున్న వ్యక్తులు స్నేక్ క్యాచర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు వచ్చి పామును పట్టుకొని అడవిలో వదిలేశారు.