Politics

ఆర్కేకు సీఐడీ నోటీసులు-తాజావార్తలు

ఆర్కేకు సీఐడీ నోటీసులు-తాజావార్తలు

* వైకాపాకు చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) సీఐడీ నోటీసులు జారీ చేసింది. రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో సీఐడీకి ఆర్కే ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఆర్పీసీ సెక్షన్‌ 160 కింద నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.రాజధాని అసైన్డ్‌ భూముల విషయంలో ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణకు సీఐడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

* సీఎం ముఖ్య సలహాదారుగా నియమితులైన నీలం సాహ్నికి వేతనం నిర్థారిస్తూ ఉత్తర్వులు. రూ.2.5లక్షల వేతనం, భత్యాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడి. నీలం సాహ్ని కార్యాలయానికి 9 మంది సిబ్బంది కేటాయింపు. రెండేళ్లు సీఎం ముఖ్యసలహాదరుగా కొనసాగుతారని వెల్లడి.

* సభలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గొంతు నొక్కుతున్నారంటూ సభ నుంచి కాంగ్రెస్ వాకౌట్ చేసింది.సీఎం కేసీఆర్, మంత్రులు కావాలనే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వాపోయారు.చేయని తప్పుకు పదే పదే క్షమాపణలు చెప్పాలనటం సరైంది కాదన్నారు.సీఎం, మంత్రులు అహంకారంతో వ్యవహరిస్తున్నారన్నారు. సభ నడుస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదంగా మారిందన్నారు. ప్రతిపక్షం ఉండకూడదన్న ఉద్దేశంతోనే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకున్నారన్నారు.

* స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగా ప్రజలు అధికార పక్షం తరపున మొగ్గు చూపిస్తారని, అలాగని ప్రజలంతా అటువైపు ఉన్నారని అనుకోకూడదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.

* తెలంగాణలో స్కూళ్ల నిర్వహణ, పరీక్షలపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలో కరోనా విజృంభణపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు కరోనా బారిన పడుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎస్ సోమేష్‌కుమార్, విద్యాశాఖ అధికారులతో కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి స్కూళ్లు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో 1-8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 1 నుంచి 8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసే ఆలోచనలో విద్యాశాఖ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పరీక్షపై కేసీఆర్ త్వరలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

* ఆధార్‌ కార్డుతో అనుసంధానం చేయలేదని దాదాపు మూడు కోట్ల రేషన్‌ కార్డులను రద్దు చేయడం తీవ్రమైన విషయమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలని కేంద్రం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు బుధవారం నోటీసులు జారీ చేసింది.

* తెలంగాణ కాంగ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై మాజీ రాజ్యసభ సభ్యడు వి. హనుమంతరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎల్పీలో కూర్చుని కాంగ్రెస్ అధినేత్రి సోనియా, రాహుల్ పై జేసీ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ తన రాజకీయాలు ఆంధ్రాలో చూసుకోవాలని తెలంగాణాలో కాదని ఆయన విమర్శించారు.

* ఏలూరులో మాగంటి బాబు కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు.

* గుంటూరు జిల్లా తెనాలిలో కరోనా కేసులు ఒక్కసారిగా విజృంభించాయి. నిన్న ఒక్క రోజే పట్టణంలో 24 కేసులు నమోదయ్యాయి. నర్సింగ్‌ కళాశాలకు చెందిన 11 మంది విద్యార్థినులకు కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. మున్సిపాలిటీలో పని చేసే ఉద్యోగులు, అధికారులు కూడా కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. కేసుల పెరుగుదలతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నర్సింగ్‌ కళాశాలలో ఎక్కువ మంది కరోనా బారిన పడటంతో కళాశాలలోని విద్యార్థులందరికీ కొవిడ్‌ పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

* పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా నుంచి గట్టి పోటీ ఎదురౌతున్న వేళ తృణమూల్‌ అధినేత్రి మమతా బెనర్జీ ప్రజలపై హామీల వర్షం కురిపించారు. మహిళలకు నెలా నెలా నగదు సాయం, రైతులకు పెట్టుబడి సాయం, విద్యార్థులకు రుణ సదుపాయం వంటి వాటికి మేనిఫెస్టోలో పెద్దపీట వేశారు. మొత్తం 10 అంశాలతో కూడిన మేనిఫెస్టోను బుధవారం సాయంత్రం మమతాబెనర్జీ విడుదల చేశారు.

* నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో పోటీ చేయాల్సిందిగా భాజపా నాయకులు తనను అడుగుతున్నట్లు మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. భాజపాలోకి రమ్మని తనను సంప్రదిస్తున్నట్లు చెప్పారు. అయితే పార్టీ మారే విషయంలో ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు.