Movies

అవి పుకార్లు

అవి పుకార్లు

కథానాయిక ఐశ్వర్యా రాజేశ్‌ గురించి వస్తోన్న వార్తలు నమ్మొద్దని ఆమె టీమ్‌ తెలిపింది. ప్రముఖ అథ్లెట్‌ బయోపిక్‌లో ఐశ్వర్య నటించనున్నారనే వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని వివరించింది. తమిళనాడుకు చెందిన ప్రముఖ మహిళా అథ్లెట్‌ శాంతి సౌందరరాజన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఏషియన్‌ గేమ్స్‌లో పతకాన్ని గెలిచిన తొలి తమిళ మహిళగా పేరు తెచ్చుకున్న ఆమె జీవిత చరిత్రపై తీసుస్తున్న సినిమాలో ఐశ్వర్యా రాజేశ్‌ ముఖ్య భూమిక పోషించనున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది.