Politics

ఏపీలో స్థానిక ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్-తాజావార్తలు

Auto Draft

* APలో స్థానికసంస్థల (MPTC & ZPTC) ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్…. రెండు దశలుగా ఎన్నికలు జరపాలని ఆదేశం…!!ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే మొదలు..!!ఎన్నికలు త్వరగా జరపాలని హైకోర్టులో 3 పిటిషన్లు దాఖలు…!!ఎల్లుండి హైకోర్టులో విచారణ…!!

* తెగించి పోరాడాలి.. తెగించి పోరాడేవాళ్లకే పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. గురువారం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ… సార్వత్రిక ఎన్నికలు వచ్చేలోపు ఇదే పెద్ద ఉప ఎన్నిక అని చెప్పారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెప్తే కుదరదని హెచ్చరించారు.

* త‌మిళ‌నాడులో బీజేపీ నేత ఖుష్బూ సుంద‌ర్ ఇవాళ త‌న నామినేష‌న్ దాఖ‌లు చేశారు.థౌజెండ్ లైట్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమె పోటీ చేస్తున్నారు.నామినేష‌న్ వేయ‌డానికి ముందు ఇవాళ ఖుష్బూ వ‌ల్లువ‌రుకోట్టంలో రోడ్ షో నిర్వ‌హించారు.

* చిన్న కాకాని ఎన్ఆర్ఐలో 11 మంది నర్సింగ్ విద్యార్థునులకు పాజిటివ్ నమోదు.. అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు.

* మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి 160 సీఆర్‌పీసీ ప్రకారం ఏపీ సీఐడీ నోటీసులు ఇచ్చింది.అమరావతి భూములు విషయంలో తనకందిన సమాచారం, తన వద్దకు రైతులు తీసుకొచ్చిన అంశాలను బేస్ చేసుకుని.. ఏదైతే కేసు ఫైల్ చేశారో.. ఆ వివరాలు, ఆధారాలను సమర్పించాలని సీఐడీ సూచించింది.దిని నిమితమై ఈ రోజు విజయవాడ సత్యనారాయణ పురంలోని సి ఐ డి కార్యాలయా లో విచారణకు హచారైన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి.రైతుల ఫిర్యాదుతోనే రాజధాని భూముల అక్రమాలపై ఆళ్ల కంప్లైంట్‌ చేసిన విషయం తెలిసిందే.ఆళ్లకు ఫిర్యాదు చేసిన రైతులు ఎవరనే చర్చ ఊపందుకుంది.

* పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ మరో అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 5, 6 7, 8 విడతల్లో పోటీ చేయబోయే 148 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ గురువారం విడుదల చేశారు. ఈ జాబితాలో పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్‌రాయ్‌, రాహుల్‌ సిన్హా, అసిమ్‌ సర్కార్‌ పేర్లు ఉన్నాయి. గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన ముకల్‌ రాయ్‌ ఈ ఎన్నికల్లో కృష్ణా నగర్‌ ఉత్తర్‌ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

* విశాఖ కార్పొరేషన్‌ మేయర్‌ పదవి నగర వైకాపాలో చిచ్చు రేపింది. మేయర్‌ పదవి ఇవ్వనందుకు నిరసనగా ఆ పార్టీ నగర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని వంశీకృష్ణ శ్రీనివాస్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆయన ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. మేయర్‌ పదవి ఇస్తామని చెప్పి వంశీకృష్ణతో కార్పొరేటర్‌గా పోటీ చేయించారని.. పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచాక ఆయన్ను మోసం చేశారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంశీకృష్ణకు సీఎం జగన్‌ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.

* తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపు మూడు రౌండ్లు పూర్తవగా తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం స్థానంలో ఓట్ల లెక్కింపు నాలుగు రౌండ్లు ముగియగా.. అక్కడ కూడా తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.