Movies

లావుగా ఉన్నానని వేధించేవారు

Sameera Reddy Shares Past Pic On Instagram And Speaks Of Body Shaming

బాలీవుడ్‌తోపాటు దక్షిణాది పరిశ్రమలోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు నటి సమీరా రెడ్డి. వివాహం అనంతరం వెండితెరకు దూరమైన ఈ నటి.. తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తూనే ఉంటారు. ఎప్పుడూ ఫన్నీ వీడియోలతో నెటిజన్లను ఆకర్షించే సమీరా తాజాగా ఓ ఎమోషనల్‌ పోస్టు‌ పెట్టారు. తన టీనేజ్‌ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. అప్పట్లో తాను బాగా లావుగా ఉండేదాన్నని.. దాంతో అందరూ నెగెటివ్‌గా కామెంట్లు చేసేవాళ్లని సమీరా తెలిపారు. శరీరాకృతిపై బయటి వాళ్లు చేసే కామెంట్లు తట్టుకోవడం ఎంతో కష్టమైన విషయమని పేర్కొన్నారు. అంతేకాకుండా, సమాజంలో ఉండే ప్రతివిషయాన్ని ఓర్పుగా ఎదుర్కోవాలని, ఎలాంటి వారినైనా సరే ఒకేలా చూడాలనే విషయాన్ని తన పిల్లలకు నేర్పుతానని నటి వివరించారు.