Politics

నన్ను గాయపరిచినా నేను మారలేదు

Eetela Rajender Speaks About His Public Service

కులం, డబ్బు, పార్టీ జెండాను కాదని, మనిషిని గుర్తు పెట్టుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక మండలం రైతు వేదికలను ప్రారంభించిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మం, న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదని రాజేందర్ పేర్కొన్నారు. తాను గాయపడినా తన మనసు మార్చుకోలేదన్నారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు తనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లారని తెలిపారు. ‘‘ఊరంతా ఒక దారి అయితే ఊసరవల్లికి ఒక దారి అన్నట్లు కొంతమంది ఉంటారు. మహాభారతంలో కౌరవులు, ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది. రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు. రావణుడు ఉన్నాడు. అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు. అందరూ ఒకే విధంగా ఉండరు. సమాజం ఆనాటి నుండి ఈనాటి వరకు మొత్తం ఒకటిగా ఉండదు, ఉంటే అది సమాజం కాదు. నాయకులంటే భారీ ఆకారంతో, అభరణాలతో, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి.’’ అని మంత్రి ఈటల తెలిపారు.