DailyDose

సెల్ఫీ తీసుకుంటూ ఆత్మహత్య యత్నం-నేరవార్తలు

Crime News - Guy Cuts With Blade To Commit Suicide On Selfie

* సెల్ఫీ వీడియో తీసుకుంటూ యువకుడు ఆత్మహత్యాయత్నం.ప్రేమించిన యువతితో వచ్చిన విభేదాల వల్ల ఓ యువకుడు సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గుంటూరులో కలకలం రేపింది.నరసరావుపేట మండలం గురవాయపాలేనికి చెందిన మహేష్ బీటెక్ పూర్తిచేసి దిల్లీలోని నోయిడాలో ఉద్యోగం చేస్తున్నాడు.ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమించగా..ఆమెతే విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.గుంటూరులోని ఓ లాడ్జిలో రూం తీసుకున్న అతడు.. విషం తాగడం సహా, బ్లేడుతో చేయి కోసుకున్నాడు.గదిలో శబ్దాలు రావడం గమనించిన లాడ్జి సిబ్బంది తలుపులు పగులగొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించి, ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

* టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద రైల్వేట్రాక్​పై ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది.ఒంగోలు మండలం కొప్పోలుకు చెందిన విష్ణు వర్ధన్​రెడ్డి, వెంకటేశ్వర కాలనీకి చెందిన నాగినేని ఇందు కొద్ది రోజులుగా ప్రేమించుకున్నారు. వీరిద్దరి కులాలు వేరు.పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోనన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నారు.

* నరసరావుపేట మండలం ములకలూరు వద్దబొలెరో లో అక్రమంగా తరలిస్తున్న 8256 నకిలీ మద్యం సీసాలు స్వాధీనం ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం కి చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు పట్టుబడిన మద్యం విలువ 12 లక్షల 50వేలు ఉంటుంది అని పోలీసుల అంచనా మద్యం తరలిస్తున్న ఒక కార్,రెండు ద్విచక్ర వాహనాలు సీజ్ చేసిన నరసరావుపేట సెబ్ పోలీసులు. కేసు నమోదు.నకిలీ మద్యం నెల్లూరు జిల్లా పొదలకురు మండలం ఉచేపల్లి లో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తింపు.

* అమరారెడ్డి కాలనీ వాసులు ఆందోళన.సిఎం ఇంటి ఎదురు నివాసం ఉండే కుటుంబాల వివరాలు సేకరిస్తున్న మునిసిపల్ సిబ్బంది.తమ గ్రుహాలు పడవేస్తారని సచివాలయం వద్దకు చేరుకున్న మహిళలు.తమ ఇళ్ళు కూల్చివేతకు కుట్ర జరుగుతోందని వార్డ్ సచివాలయం ముట్టడి.సుమారు సియం ఇంటి ఎదురుగా నివసిస్తున్న 300 పైన కుటుంబాలు.

* మంత్రులు బొత్స, పెద్దిరెడ్డిలకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు..గవర్నర్ తో తన ఉత్తరప్రత్యుత్తరాల లీకేజ్ పై సీబీఐ విచారణ కోరుతూ SEC నిమ్మగడ్డ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ.వచ్చే మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు.గవర్నర్ కార్యాలయం నుంచి ప్రివిలేజ్ లెటర్స్ లీకేజ్ అవలేదని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ తమకు తెలిపారని చెప్పిన ఎస్ ఈ సి తరపు న్యాయవాది.విచారణ సీబీఐ తో జరపాలన్న SEC.