Health

ఎసిడిటీకి సహజ విరుగుడు ఇదుగో!

How to beat acidity and gas trouble?

రోజువారీ ఆహారంలో కొబ్బరి నీళ్లను కూడా చేర్చడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చంటున్నారు వైద్య నిపుణులు. వాటిల్లో ముఖ్యమైన ప్రయోజనాలివి…

*అధిక బరువు
ఇందులో ఉండే బయోయాక్టివ్‌ ఎంజైమ్స్‌ జీవ, జీర్ణక్రియలను మెరుగుపరచడానికి తోడ్పడతాయి. తద్వారా బరువు తగ్గే ప్రక్రియ వేగవంతమవుతుంది.

*ఎసిడిటీ
కొబ్బరి నీళ్లలోని బయోయాక్టివ్‌ ఎంజైమ్స్‌తో పాటు అధిక మొత్తంలో లభ్యమయ్యే ఫైబర్‌….పేగుల కదలికను నియంత్రిస్తుంది. ఎసిడిటీ, అజీర్ణం, ఇతర పేగు సంబంధిత సమస్యలను దూరంగా ఉంచుతుంది.

*డీహైడ్రేషన్‌
శరీరంలో ఎలక్ర్టోలైట్స్‌ను తిరిగి నింపడంలో కొబ్బరినీళ్లు ఎంతో ఉపకరిస్తాయి. తద్వారా శరీరానికి అవసరమైన నీటిని అదించి, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా రక్షిస్తాయి.

*బీపీ
రోజూ కొబ్బరి నీళ్లు తాగడం వల్ల హైపర్‌టెన్షన్‌ నియంత్రణలో ఉంటుందన్నది ఓ పరిశోధన సారాంశం. కొబ్బరి నీరు రక్త పోటును సరైన స్థాయిల్లో ఉంచడానికి దోహదపడుతుంది.

*డీటాక్సిఫికేషన్‌
కొబ్బరి నీళ్లలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి, కడుపులో మంటను తగ్గిస్తాయి.