Movies

ఛత్రపతి రీమేక్‌లో నాగబాబు?

Nagababu To Be The Villain As Kataraj In Chatrapati Bollywood Remake

నటుడు నాగబాబు బాలీవుడ్‌ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘ఛత్రపతి’ రీమేక్‌తో ఆయన బీటౌన్‌లోకి వెళ్లనున్నారని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘ఛత్రపతి’. ఈ చిత్రాన్ని హిందీలోకి రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న ఈ రీమేక్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్‌ రూపొందించనున్నారు. కాగా, తాజా సమాచారం ప్రకారం.. నాగబాబు ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఇప్పటికే నాగబాబుతో చిత్రబృందం చర్చలు జరిపినట్లు బీటౌన్‌లో టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నాగబాబు సైతం తన పాత్ర కోసం సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, సదరు వార్తలపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.