DailyDose

గంపలగూడెం రేపిస్టుకు 20ఏళ్ల జైలు-నేరవార్తలు

Crime News - Gampalagudem Rapist Sentenced To 20Years By Khammam Court

* ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఓ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఖమ్మం ఒకటో ప్రత్యేక ఫోక్సో (ఫాస్‌ట్రాక్‌) కోర్టు న్యాయమూర్తి డానీరుత్‌ బుధవారం తీర్పు వెలువరించారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామానికి చెందిన గరేళ్లి కొండయ్య 2018లో మేస్త్రీ పని కోసం మధిర మండలంలోని ఓ గ్రామానికి వచ్చాడు. అక్కడ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మధిర ఠాణా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. సదరు కేసును విచారించిన న్యాయమూర్తి.. నిందితుడిపై నేరం రుజువు కావడంతో పై విధంగా తీర్పు ఇచ్చారు.

* తెలంగాణ భీం ఆర్మీ చీఫ్ సుజీత్ రావణ్ పై దాడి ఘటన పై పూర్తి వివరణ ఇచ్చిన పంజాగుట్ట ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి. సుజిత్ పై ఎలాంటి హత్య యత్నం జరగలేదు.బుదవారం అతను తన బంధువుల ఇంట్లో ఫంక్షన్ కి వెళ్లి వస్తున్న సమయం లో అకస్మాత్తుగా స్పీడ్ బ్రేకర్ రావడం తో పక్కనే ఉన్న గ్రిల్ పై పడటం తో గాయాలు అయ్యాయి.ప్రమాదం వల్ల ఏమి జరిగిందో అర్థం కాని పరిస్థితిలో సుజీత్ కుటుంబ సభ్యులు అనుమానం తో పోలీసులకు పిర్యాదు.దీంతో తాము విచారణ జరిపి రాత్రి సంఘటన జరిగిన ప్రదేశంలోని సీసీ కెమెరాలను పరిశీలించడం ద్వారా సుజీత్ పై ఎవ్వరూ దాడికి పాల్పడలేదని నిరూపణ అయ్యింది అని సుజీత్ కుటుంబ సభ్యులకు కూడా సీసీ కెమెరాల లో రికార్డ్ అయిన మొత్తం సంఘటన ని చూపించడం ద్వారా వారు నిజం తెలుసుకుని ఇచ్చిన పిర్యాదు వెనుకకు తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.

* కడప జిల్లా బద్వేల్ ….ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య….కడప పట్టణంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న నేలటూరు శ్రీనివాసులురెడ్డి…బికోడూరు మండలం సిద్దుగారిపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు రెడ్డి…ఎవరూ లేని సమయాన తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీనివాసులు రెడ్డి…మృతుడి అరచేతిలో ప్రెజర్ ఇన్ కాలేజ్ అని రాయబడి వుంది…

* మంచిర్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన కాసిపేట మండలం మల్కపల్లిలో గురువారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రమేశ్‌, పద్మ దంపతులు గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో గదిలో వారి కొడుకు అక్షయ్‌ (17), కూతురు సౌమ్య (19) మృతదేహాలున్నాయి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే, కూతురు సౌమ్య ఇటీవల అత్తవారింటి నుంచి పుట్టింటికి వచ్చింది. సౌమ్య అత్తవారింటి నుంచి వచ్చి పుట్టింట్లో తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడంతో జిల్లాలో సంచలనంగా మారగా.. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల వద్ద విద్యార్ధిని మేరీ గ్రేస్ మృతికి నిరసనగా విద్యార్ధుల ఆందోళన

* అసెంబ్లీ లో ఎమ్మెల్సీ వాణీ దేవి వాహనానికి ప్రమాదం..వాహనంలో లేని వాణీ దేవి..నుజ్జునుజ్జయిన కారు ముందు భాగం..గేటును ఢీకొట్టిన కారు..డ్రైవర్ బదులు గన్ మెన్ నడపటం తో ప్రమాదం.