Business

20 కియా కార్లకు జగన్ సర్కార్ ఆర్డర్-వాణిజ్యం

Business News - Jagan Govt Orders 20 Kia Carnival Cars

* దేశంలోని 72%కి పైగా సహకార సంఘాలు ఆదాయపన్ను విభాగానికి దొరకకుండా ఉన్నాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) పేర్కొంది. దేశంలో ప్రస్తుతం ఉన్న సహకార సంఘాల సంఖ్యకు, ఐటీ డేటాబేస్‌లో సంఖ్యకు అసలు పొంతనే లేదని తేల్చింది.

* హైకోర్టు న్యాయమూర్తుల వినియోగానికి కొత్తగా కియా కార్ల కొనుగోళ్లకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ..ఒక్కొక్కటి రూ.31.5 లక్షల చొప్పున 20 కియా కార్నివాల్ లిమోసిన్స్ కార్లు కొనుగోలుకు రూ.6.3 కోట్లు విడుదలకు అంగీకారం.. న్యాయ మూర్తులకు కియా కార్లు కావాలని ఈ నెల 24 తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ లేఖ..

* రెండు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ స్టాక్‌ మార్కెట్లు కోలుకుని మళ్లీ లాభాల బాటపట్టాయి. భారీ నష్టాలతో దిగొచ్చిన షేర్ల కొనుగోలుకు ఇదే తగిన సమయం అని మదుపరులు భావించడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు సూచీలకు కలిసొచ్చింది. ముఖ్యంగా మెటల్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లకు కొనుగోలు మద్దతు లభించింది. దీంతో సూచీలు భారీ లాభాలను సొంతం చేసుకున్నాయి. సెన్సెక్స్‌ మళ్లీ 49వేల మార్కు, నిఫ్టీ 14,500 మార్కును అందుకున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 72.51గా ఉంది.

* ట్రక్కుల తయారీ కంపెనీ అశోక్‌ లేల్యాండ్‌ శుక్రవారం మార్కెట్లోకి సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. 4 యాక్సిల్స్‌తో 14 చక్రాలపై నడిచే ఏవీటీఆర్‌ 4120ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రక్‌ 40.5 టన్నుల సరకులు మోయగలదు. ఈ కంపెనీ ఉత్పత్తి చేసే స్టాండర్డ్‌ ట్రక్కులతో పోలిస్తే ఇది 5 టన్నులు ఎక్కువ. ఈ సందర్భంగా అశోక్‌ లేల్యాండ్‌ ఎండీ విపిన్‌ సోంధీ మాట్లాడుతూ ‘‘మా వినియోగదారుల అవసరాలను తీర్చేలా మా ప్రయత్నాలు ఉంటాయి. వారికి మెరుగైన ఉత్పత్తులను, మరింత లాభాలను అందించడమే మా లక్ష్యం. ఆ దిశగా మేం వేసిన మరో అడుగు ఏవీటీఆర్‌ 4120 ట్రక్కు’’ అని పేర్కొన్నారు.

* టాటాసన్స్‌కు నేడు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. గతంలో సైరస్‌ మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమించాలంటూ నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును నిలిపివేసింది. నేడు దీనిపై చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఏఎస్‌ బోపన్న,జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉన్నారు. గతేడాది డిసెంబర్‌ 17న ఈ కేసులో తీర్పును రిజర్వులో ఉంచింది.