DailyDose

ముంగినపూడి బీచ్‌లో మునిగిన ప్రాణం-నేరవార్తలు

Crime News - BSC Student Dead In Munginapudi Beach

* మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో విషాదం చోటుచేసుకుంది.గుడివాడ మండలం సిద్ధాంతం గ్రామానికిచెందిన ఆరుగురు యువకులు మంగినపూడి బీచ్ సముద్రంలో స్థానం ఆచరిస్తూ ఉండగా…వారిలో గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలలో బి ఎస్ సి చదువుతున్న అభినయ బోస్ గల్లంతు…గల్లంతైన బోస్ కొరకు మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు..తీరానికి చేరిన గల్లంతైన బోస్ మృతదేహం.

* పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు – కాపవరం గ్రామాల మధ్య గల ఎన్ హెచ్ 5 హోటల్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.విశాఖపట్నం నుండి విజయవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, తిరుపతి నుండి రాజమండ్రి వైపు ప్రయాణిస్తున్న కారును రాత్రి 1.30 సమయంలో ఢీకొనడంతో ప్రమాదం.సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి.నలుగురికి గాయాలు.కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు కుటుంబ సభ్యులు. భార్య, భర్త, కొడుకు, కూతురు, అల్లుడు.కుటుంబ యజమాని (55) మృతి.

* గుడ్లవల్లేరు రెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొన్న టిప్పర్. ముగ్గురు మృతి…..తొమ్మిది మందికి గాయాలు.

* నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద లారీని టెంపో వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో టెంపోలో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.మృతులు తమిళనాడు వాసులుగా గుర్తించారు.వీరంతా శ్రీశైలం నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

* గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.వడ్లమన్నాడు వద్ద టిప్పర్ ను, ఢీ కొట్టిన అటో, ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది కి తీవ్ర గాయాలయాలు.గుడ్లవల్లేరు నుండి పెడన మండలం జింజెరు గ్రామం కూలీలతో ఆటో వెళ్తుండగా జరిగిన ప్రమాదం.మృతులు జింజెరు గ్రామానికి చెందిన జన్ను నాంచారయ్య, జన్ను వెంకన్న, మోటుకురు శివలుగా గుర్తింపు.మృతులు, క్షతగాత్రులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో, శోక సముద్రంలో మునిగి పోయిన జింజెరు గ్రామం.క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.