DailyDose

ప.గోలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి-నేరవార్తలు

ప.గోలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి-నేరవార్తలు

* చాగల్లు మండలం ఊనగట్ల లో ఏడు సంవత్సరాల స్కూల్ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఆటోడ్రైవర్.పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి.పోక్సో కేసు నమోదు.

* కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య.శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో సివిల్ డిపార్ట్మెంట్ లో ఈ3 చదుతున్న యం.మాధురి తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య.ఈమెది తూర్పు గోదావరి జిల్లా కాకినాడ స్వస్థలం.

* విజయనగరం జిల్లా సుంకరిపేట వద్ద ఈ ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన గ్యాస్ సిలిండర్ల లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి.అదే సమయంలో వైజాగ్ నుంచి విజయనగరం వైపు వస్తున్న మరో ఆర్టీసీ బస్సు వెనక వైపు నుంచి బస్సును ఢీకొంది.

* దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన మదనపల్లె జంట హత్య కేసు నిందితులను.. విశాఖ నుంచి మదనపల్లెకు తరలించారు.ఉన్నత చదువులు చదివి.. మూఢ నమ్మకాలతో.. కన్న బిడ్డలనే కడతేర్చిన పురుషోత్తం, పద్మజలను సాయుధ పోలీసు రక్షణతో తీసుకొచ్చి.. మదనపల్లె సబ్‌జైలు అధికారులకు అప్పగించారు.

* బారాముల్లా జిల్లాలో సోమవారం ముష్కరులు కాల్పులు తెగబడ్డారు.సోపోరా ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ మునిసిపల్​ కౌన్సిలర్​, ఆయన సెక్యూరిటీ గార్డ్​ మృతి చెందినట్లు పోలీసులు స్పష్టం చేశారు.మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలైనట్లు తెలిపారు.

* పాల్​గఢ్​ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.మృతుల్లో ఇద్దరు మహిళలు, యువతి, బాలుడు ఉన్నారు.జిల్లాలోని మోఖాడాలో ఆదివారం రాత్రి 2.30 గంటలకు ఓ దుకాణంలో షార్ట్​ సర్క్యూట్​ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.ఇంట్లోనే దుకాణం ఉండటం కారణంగా మంటలు వ్యాపించినట్లు తెలిపారు. ఇల్లు మొత్తం మంటల్లో దగ్ధమైనట్లు వెల్లడించారు.గాయాలైన ముగ్గురు బాధితులను నాసిక్ సివిల్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

* కోబ్రామెండా అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్‌మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా కోబ్రామెండా అటవీ ప్రాంతంలో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు.మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు.కోబ్రామెండాలో 3 రోజుల నుంచి కూంబింగ్​ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కూంబింగ్​లో భాగంగా రెండు రోజుల క్రితం మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేశారు.