NRI-NRT

ఎల్లాప్రగడ హేమకు యూకె పార్లమెంట్ పురస్కారం

Hema Ellapragada UTHO Recognized By UK Parliament

యూకేలో ఓరుగల్లు మహిళ చేపట్టిన తెలుగు ఉద్యమానికి అక్కడి పార్లమెంట్‌లో గుర్తింపు లభించింది. ఆమె అధ్యక్షురాలిగా ఉన్న యునైటెడ్‌ కింగ్‌డమ్‌ తెలుగు హిందూ ఆర్గనైజేషన్‌ (ఉఠో) ‘యూకే పార్లమెంట్‌ వీక్‌ యాక్టివిటీ ఆఫ్‌ది ఇయర్‌’ పురస్కారం గెలుచుకుంది. వరంగల్‌కు చెందిన హేమ ఎల్లాప్రగడ పదిహేనేళ్ల క్రితం యూకే వెళ్లి కుటుంబంతో స్థిరపడ్డారు. వార్విక్‌ విశ్వవిద్యాలయంలో చరిత్రపై పరిశోధన చేశారు. తెలుగు భాష పరిరక్షణకు అక్కడ అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. యూకేలో సుమారు 50 వేల మంది తెలుగు వారు స్థిరపడినా.. అక్కడి జనరల్‌ సర్టిఫికెట్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (జీసీఎస్‌ఈ)లో తెలుగు భాషకు చోటు దక్కలేదు. గుజరాతీ, హిందీ, తమిళం, పంజాబీ లాంటి పలు భారతీయ భాషలను జీసీఎస్‌ఈలో భాగంగా అక్కడి విద్యాలయాల్లో బోధిస్తున్నారు. తెలుగును కూడా చేర్చాలని హేమ ఎల్లాప్రగడ ఉద్యమం చేస్తున్నారు.