Politics

పవన్ కళ్యాణ్‌ను పువ్వులా చూసుకోమన్న మోడీ-తాజావార్తలు

News Roundup - Modi Asked To Treat Pawan As Flower Says Somu

* బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన కామెంట్స్.రాష్ట్రానికి కాబోయే సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.పవాన్ కళ్యాణ్ కు సముచిత గౌరవం ఇవ్వాలని నేరుగా ప్రధాని నరేంద్రమోడీ నాకు సూచించారు.పవన్ కళ్యాణ్ ని పువ్వులా చూడాలని ప్రధాని నాకు హెలికాఫ్టర్ లో చెప్పారు.పవన్ కళ్యాణ్ అంటే ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకి చాలా ఇష్టం.2014 ఎన్నికల్లోనే వర్షంలో తడుస్తూ ఇదే తిరుపతిలో నరేంద్రమోదీ, పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించారు.ఈ అంశాన్ని ట్రూ స్పిరిట్ తో బీజేపీ, జనసేన కార్యకర్తలు తీసుకోవాలి.బీజేపీ, జనసేన సమన్వయ సమావేశంలో సోము వీర్రాజు.

* అమెరికా నేవీ అధికారులు హిందీ పాటతో అదరగొట్టారు. షారుఖ్‌ పాట పాడి అబ్బురపరిచారు. యూఎస్ నౌకాదళ ఆపరేషన్స్‌ చీఫ్‌ మైకేల్‌ ఎమ్‌ గిల్డే, భారత రాయబారి తరన్‌జిత్‌సింగ్‌ సంధు మధ్య జరిగిన విందు సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. 2004లో విడుదలైన షారుక్‌ ఖాన్‌ నటించిన ‘స్వదేశ్‌’ చిత్రంలోని ‘యే జో దేశ్‌ హై తేరా’ పాట పాడి అలరించారు. అక్కడే ఉన్న వాయిద్యకారులు సంగీతం అందిస్తుండగా వారు ఈ పాట పాడటం విశేషం. తరన్‌జిత్‌సింగ్‌ సంధు ఆ వీడియోను ట్విటర్‌లో పంచుకొని హర్షం వ్యక్తం చేశారు. భారత్‌-అమెరికాకు మధ్య ఉన్న బంధానికి ఇది నిదర్శనమని సంధు పేర్కొన్నారు. ఆయన పంచుకున్న ఈ వీడియోను 1.96 లక్షల మంది చూశారు. యూఎస్‌ నేవీ సైతం ఈ వీడియోను పంచుకొంది. భారత్‌కు హోలీ శుభాకాంక్షలు తెలిపింది.

* క్షేత్రస్థాయిలో పటిష్ఠమైన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెదేపాకు భవిష్యత్తు లేదని కొందరు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తోసి పుచ్చారు. పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ఆయన ప్రసంగించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని కోరారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తెదేపాదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

* వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అస్వస్థత. చెన్నై అపోలో హాస్పిటల్ లో ఎమ్మెల్యే రోజాకు శస్త్రచికిత్స నిర్వహించారు.ఈ మేరకు రోజాకు రెండు మేజర్ ఆపరేషన్ లు జరిగినట్టు భర్త సెల్వమణి వెల్లడించారు.రోజా ఆరోగ్య పరిస్తితి మీద ఆందోళన పడాల్సిందేమీ లేదని ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని ఆడియో విడుదల చేశారు. ఐసీయూ నుంచి ఇవాళ వార్డుకు తరలించారు.అయితే రోజా ప్రస్తుతం కోలుకుంటున్నారని, రెండు వారాల పటు విశ్రాంతిలో ఉండనున్నారని ఆమె భర్త సెల్వమణి తెలిపారు.అభిమానులెవ్వరూ హాస్పిటల్ కి రావొద్దని ఆడియో టేప్ రిలీజ్ చేశారు.

* నాగార్జునసాగర్ బీజేపీ అభ్యర్థిగా కంకణాల నివేదిత రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన బిజెపి అధిష్టానం

* నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థిగా నోముల భగత్ పేరును పార్టీ అధినేత , ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ఖరారు చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్ లో సోమవారం భగత్ కు పార్టీ బి – ఫారం ను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి , ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ , ఎమ్మెల్సీ లు శేరి సుభాష్ రెడ్డి , పల్లా రాజేశ్వర్ రెడ్డి , తేరా చిన్నపరెడ్డి , పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్ కుమార్ రెడ్డి , సాగర్ టి ఆర్ ఎస్ నాయకులు ఎం సి కోటిరెడ్డి , నోముల లక్ష్మి , కుటుంబ సభ్యులు ఉన్నారు . పార్టీ ప్రచారం కోసం రూ.28 లక్షల చెక్ ను కూడా పార్టీ అధినేత కేసీఆర్ భగత్ కు అందించారు .

* గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్కులు తప్పనిసరి చేస్తూ జీహెచ్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. ఫతేనగర్‌లో మాస్క్‌ లేకుండా కస్టమర్స్‌ను షాపులోకి అనుమతించిన ఓ షాపు యజమానికి 2 వేల జరిమానా విధించారు. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. మరింత పకడ్బందీగా కొవిడ్‌ నిబంధనల అమలులో భాగంగా.. మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. బహిరంగ ప్రదేశాలు, పని ప్రాంతాలు, ప్రజా రవాణా వాహనాల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్‌ ధరించని వారిపై విపత్తు నిర్వహణ చట్టం-2005లోని 51 నుంచి 60 సెక్షన్లతో పాటు ఐపీసీ 188 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

* తెలుగు రాష్ట్రాలను కరోనా సెకండ్ వేవ్ అతలాకుతలం చేస్తున్నది. రోజువారీ పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు..గతేడాది జరిగిన ఘోరాలను తలచుకొని ఆందోళన చెందుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ తో భయాందోళనలు వద్దు అని ప్రభుత్వాలు చెప్తున్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తే మహమ్మారిని ఎదుర్కొనవచ్చని చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది..తెలుగు రాష్ట్రాల్లో వేడి గాలులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది వేసవిలో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు.