NRI-NRT

యువతరాన్ని ప్రోత్సహిస్తా -TNIతో వాసిరెడ్డి వంశీ

tana-new-jersey-rvp-2021-candidate-vamsi-vasireddy-profile

తానా ప్రధానోద్దేశం “మన యువతే మన సంపద” అనే నినాదానికి గొడుగు పడతానని, తనను గెలిపిస్తే స్థానిక ప్రవాస తెలుగు యువతతో పాటు అమెరికన్ తెలుగు యువతను సైతం తానా వైపు ఆకర్షించే కార్యక్రమాలను రూపొందించి సంస్థకు నూతన జవసత్వాలు తీసుకువస్తానని తానా 2021 ఎన్నికల్లో న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధిగా బరిలో ఉన్న వాసిరెడ్డి వంశీ TNIకు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామకు చెందిన ఆయన 2007లో అమెరికాకు వచ్చారు. 2013 నుండి తానాలో టీం స్క్వేర్ వాలంటీర్‌గా సేవలందిస్తున్నారు. న్యూ ఇంగ్లాండ్, న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో తానా కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించారు. న్యూజెర్సీలో నిర్వహించిన తానా కార్యక్రమాలకు స్థానిక ప్రాంతీయ ప్రతినిధులు, స్థానిక సేవకులతో కలిసి సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించారు.

* 2015-17: తానా మెంబర్ బెనెఫిట్స్ కమిటీ ఉపాధ్యక్షుడు
* 2017-19: తానా 5కె రన్ నార్త్ ఈస్ట్ సమన్వయకర్త
* 2019-21: తానా 5కె రన్ జాతీయ సమన్వయకర్త

తన అభ్యర్థిత్వాన్ని బలపరచవల్సిందిగా వంశీ తానా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

యువతరాన్ని ప్రోత్సహిస్తా -TNIతో వాసిరెడ్డి వంశీ-TANA New Jersey RVP 2021 Candidate Vamsi Vasireddy Profile