DailyDose

సీబీఐ అధికారులను కలిసిన వివేకా కుమార్తె-నేరవార్తలు

YS Viveka Daughter Sunitha Meets CBI To Enquire Her Dad's Murder

* సీబీఐ అధికారులను కలిసిన వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె.ఇంతవరకు ఎవరు హత్యచేసారో తెలియలేదు.రెండు సంవత్సరాలు కావస్తున్నా హంతకులను పట్టుకోలేదు.మాజీ ముఖ్యమంత్రి తమ్ముడికే న్యాయం జరుగకపోతే సామాన్యుడి పరిస్థితి ఏంటి.వైసీపీ అధికారంలో ఉన్నా మాకు న్యాయం జరుగలేదు.ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత.

* గంగాధర నెల్లూరు మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న క్వారీలో గురువారం సాయంత్రం యువకుడు ప్రమాదవశాత్తు గల్లంతు..యువకుని జాడ కోసం శుక్రవారం ఉదయం 7:30 నుంచి నీటిలో గాలింపు చర్యలు చేపట్టిన రెస్క్యూ టీం సిబ్బంది..క్వారీ ఒడ్డునే ఉన్న గల్లంతైన యువకుని బట్టలు..యువకునికి మూర్ఛ వ్యాధి సైతం ఉన్నట్లు సమాచారం..స్థానిక ఎస్ఐ సుమన్ సమాచారం మేరకు..ఏడీఎఫ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో..మధుకుమార్, కుశలం, నరేష్, రామచంద్రయ్య, చైతన్య కుమార్ లచే గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం..ఉదయం 8:50 గం.లకు క్వారీ నుండి మృతదేహాన్ని వెలికి తీసిన రెస్కూ టీం…గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన ఏసు కుమారుడు చంద్రశేఖర్ @ చార్లెస్ (29) గా గుర్తించిన పోలీసులు..పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలింపు…

* పాడేరు ఘాట్‌రోడ్డులో ప్రమాదం జరిగింది. వంటలమామిడి సమీపంలో ట్రాలీ లారీ బోల్తాపడి ఒకరు మృతి చెందారు.

* మరో నాలుగు రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. చెన్నై నీలంకరైలోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్​ అల్లుడు శబరీశన్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు.

* ముప్పాళ్ళ మండలం రుద్రవరంలో చోరీ.ఓ ఇంటి తాళలు పగులగొట్టి చోరికి పాల్పడ్డ దుండగులు.20 సవర్ల బంగారు ఆభరణాలు..30 వేల నగదు అపహరణ.పియస్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు.