Devotional

బాధ్యతలు స్వీకరించిన రమణదీక్షితులు-తాజావార్తలు

Ramana Deekshitulu Takes Charge In TTD Temple

* తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులుగా రమణదీక్షితులు.ఆలయ ప్రధాన అర్చకులుగా బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు.ప్రస్తుతం గొల్లపల్లి వంశం నుంచి ప్రధాన అర్చకులుగా ఉన్న వేణుగోపాల దీక్షితులు.ఆలయ పర్మినెంట్ ఉద్యోగిగా ఉన్న వేణుగోపాల దీక్షితులు.

* కుప్పం టీడీపీలో ముసలం పుట్టింది. చంద్రబాబు తీరుపై నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల బహిష్కరణపై మండిపడుతున్నారు. చంద్రబాబు నిర్ణయానికి నిరసనగా పార్టీకి ఐదుగురు టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు రాజీనామా చేశారు. టీడీపీకి రాజీనామా చేసి వారు వైఎస్సార్‌సీపీలోకి చేరారు.

* గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 31,072 కరోనా పరీక్షలు నిర్వహించగా, 1,730 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,07,676 మందికి కరోనా వైరస్‌ సోకింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

* వాలంటీర్‌పై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యానికి దిగారు. ఎన్నికల్లో వాలంటీర్‌ హరికుమార్‌ తనకు సహకరించలేదనే కారణంతో జేసీ కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. ఇంటిని కూల్చేస్తానంటూ వాలంటీర్‌ను జేసీ ప్రభాకర్‌ రెడ్డి బెదిరించారు. జేసీ ఆదేశాలతో వాలంటీర్ ఇంట్లోని మోటార్‌ను ఆయన అనుచరులు లాక్కెళ్లారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, విచారణ చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటుకు నోటు తీసుకున్నవారు తనను ప్రశ్నించొద్దంటూ జేసీ హుకుం జారీ చేశారు.

* మావోయిస్టులు రక్తపాతాన్ని సృష్టించడాన్ని సహించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఈ సమయంలో నక్సల్స్‌కు సరైన సమయంలో దీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అస్సాంలో పర్యటిస్తోన్న అమిత్‌ షా, ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌ ఘటన నేపథ్యంలో ఆయన హుటాహుటీన దిల్లీకి ప్రయాణమయ్యారు.

* జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ రాష్ట్రానికి అద్దెమైకులా తయారయ్యారని ఏపీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఉత్తరాది భాజపా దక్షిణాదికి అన్యాయం చేస్తోందని గతంలో చెప్పిన పవన్‌.. ఇప్పుడు ఆ పార్టీకి మద్దతివ్వాలని కోరుతున్నారని ఆక్షేపించారు. తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం, రథాల దగ్ధం కేసుల్లో భాజపా ప్రమేయం ఉందేమోననే అనుమానం తమకు ఉందని.. అందుకే సీబీఐ విచారణ కోరినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్ని నాని ఆరోపించారు.

* హైదరాబాద్‌లోని రహదారులను సిగ్నల్‌ రహితంగా చేసేందుకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన మరో ప్రాజెక్టు నగర వాసులకు అందుబాటులోకి రానుంది. రూ.66.59 కోట్ల వ్యయంతో నిర్మించిన హైటెక్ సిటీ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ రేపు ప్రారంభించనున్నారు. దాదాపు 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పు కలిగిన ఈ ఆర్‌యూబీ అందుబాటులోకి వస్తే కూకట్‌పల్లి-హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులకు ఉపశమనం కలగనుంది. ఈ మార్గంలో లాక్‌డౌన్‌కు ముందు నిత్యం 5 నుంచి 6 లక్షల వాహనాలు రాకపోకలు సాగించేవని పోలీసులు అంచనా. ఇప్పటికే స్ట్రాటజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (ఎస్ఆర్‌డీపీ)లో భాగంగా మొదటి దశలో గచ్చిబౌలి నుంచి జేఎన్‌టీయూ వరకు చేపట్టిన పలు పైవంతెనలు, అండర్ పాస్‌లు.. బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్, అయ్యప్ప సొసైటీ, రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

* పరిషత్‌ ఎన్నికలపై ఏపీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తాజాగా ఎస్‌ఈసీ జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ భాజపా, జనసేన దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు నిన్న పూర్తయ్యాయి. అనంతరం దీనిపై ఎస్‌ఈసీ కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ సందర్భంగా హైకోర్టు విచారణ చేపట్టింది.

* రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా విస్తరిస్తోన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టడి చర్యలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ఆరా తీశారు. ఈ మేరకు పుదుచ్చేరి నుంచి మంత్రి ఈటలకు గవర్నర్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. కొవిడ్‌ కట్టడికి తీసుకుంటున్న చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకీ రాష్ట్రంలో కేసుల సంఖ్య పెరగడంపై గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ కట్టడి, వ్యాధి నిర్ధారణ, రోగులకు అందిస్తున్న చికిత్సలకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని.. ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్ర ప్రజలను కోరారు.