Politics

Breaking: తమిళనాడులో ₹428కోట్లు సీజ్

Breaking: తమిళనాడులో ₹428కోట్లు సీజ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది గంటల సమయమే ఉంది. ఈ క్రమంలో భారీ స్థాయిలో నగదు, నగలు అధికారులు సీజ్ చేసినట్లు చెబుతున్నారు. ఇంకొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా ఓటర్లకు పంచడానికి సిద్ధం చేసిన 428 కోట్ల నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. గడిచిన 24 గంటల్లో చెన్నై సహా కోయంబత్తూర్, తిరుప్పూర్, కరూర్ తదితర నగరాల్లో అనుమానిత ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బృందాలుగా విడిపోయి అధికారులు ఆయా ప్రాంతాల్లో సోదాలు చేయగా 428 కోట్ల సొత్తు పట్టుబడినట్టు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో రూ. 225.5 కోట్లు నగదు కాగా, బంగారంతో సహా విలువైన లోహ ఆభరణాల విలువ రూ.176.11 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.