Food

ఖర్జూరం తింటే నాజూగ్గా అవుతారు

ఖర్జూరం తింటే నాజూగ్గా అవుతారు

ఎడారి ప్రాంతాల్లో విరివిగా పండే మొక్క ‘ఖర్జూరం’. ఒకప్పుడు ఈ పండ్లు కేవలం అక్టోబర్, డిసెంబర్ మధ్య కాలంలో మాత్రమే లభించేవి. కానీ ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దొరకుతూనే ఉన్నాయి. ఇతర పండ్లతో పోలిస్తే తక్కువ ధరకే ఇవి మనకు అందుబాటులో ఉన్నాయి. దీన్ని నిత్యం మన ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో బోలెడు ఆరోగ్యకర ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం.
1. సెలీనియం, మెగ్నిషియం, కాపర్ వంటి మూలకాలతోపాటు ఖర్జూరాల్లో ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. కేవలం కొన్ని ఖర్జూరాలను తింటే చాలు పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.
2. ఖరూర్జాలను నిత్యం కొంత మోతాదులో తీసుకుంటే కడుపులో పేగుల కదలికలు ఆరోగ్యకర స్థాయిలో ఉంటాయి. జీర్ణక్రియ, జీవక్రియ రేటు మెరుగుపడడంతోపాటు మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
3. శరీరంలో మంచి బాక్టీరియా స్థాయిని ఇవి పెంచుతాయి. అదే సమయంలో చెడ్డ బాక్టీరియాలను తగ్గిస్తాయి.
4. తక్కువ స్థాయిలో క్యాలరీలను కలిగి ఉండడమే కాక శరీరానికి త్వరగా శక్తిని అందిస్తాయి. కొవ్వులు, ట్రాన్స్ఫ్యాట్లు వీటిలో ఉండవు. గుండెను ఆరోగ్యకరంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
5. గొంతు నొప్పి, మంట, జలుబు వంటి సమస్యలు ఉన్నవారు ఖర్జూరా గుజ్జు లేదా సిరప్ను తీసుకుంటే ఫలితం ఉంటుంది. నిత్యం తగినంత ఖర్జూరం తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. వీటిలో ఉండే ఐరన్ రక్తహీనతను నివారిస్తుంది.