Health

భారతదేశంలో బెంబేలెత్తిస్తున్న కిడ్నీ వ్యాధులు

భారతదేశంలో బెంబేలెత్తిస్తున్న కిడ్నీ వ్యాధులు

భారతదేశంలోఅత్యంతప్రమాదకరంగా పరిణమిస్తున్న వ్యాధి కిడ్నీల వైఫల్యం. ఇటీవలి కాలంలోకిడ్నీఫెయిల్యూర్స్‌ ఆందోళన కలిగించే స్థాయిలో నమోదవుతున్నాయి. ఆధునికవైద్యప్రక్రియలు ఎన్ని వచ్చినా.. కిడ్నీ ఫెయిల్యూర్‌ను అధిగమించిసంపూర్ణఆరోగ్యవంతులైన వారు అరుదుగానే కనిపిన్నారు. అయితే కిడ్నీవ్యాధులకుఆయుర్వేదం, హోమియోపతి వెద్యులు పునర్నవను మంచిఔషధంగా సూచిస్తున్నారు. మనపల్లెల్లో పొలాల వెంబడి కనిపించే తెల్ల గలిజేరు కూర నుపునర్నవ అనిపిలుస్తారనే విషయం చాలా మందికి తెలియదు. పేరుకు తగ్గట్టే పునర్నవకిడ్నీవ్యాధులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో, హోమియోపతిలో పునర్నవమందులు ఇప్పటికే అందుబాటులోఉన్నాయి. తెల్ల గలిజేరుగా పేరున్న పునర్నవతరుచూ మన వంటకాల్లో వాడటం వల్ల కిడ్నీవ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఈ ఆకుకూరరుచిలో కూడా మేటిగా ఉంటుంది. పప్పుల్లో, పొడికూరగా గలిజేరు కూరను వాడటంమంచిది. మధుమేహవ్యాధిగ్రస్తులు ఈ కూరను తరచూ తీసుకోవడం వల్ల షుగర్‌నియంత్రణలో ఉంటుంది. కిడ్నీసంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఆరోగ్యఫలంసీతాఫలంసీతాఫలాలసీజన్‌వచ్చేసింది. మార్కెట్లో విరివిగా ఈ పండ్లు దొరుకుతున్నాయి. ఇంతకీసీతాఫలం వల్ల మనకుఎలాంటి ఫలాన్నిస్తుందో తెలుసుకుందాం.తిన్న వెంటనే శక్తినిచ్చే పండు సీతాఫలం. కండరాలకు బలాన్నిస్తుంది. విటమిన్‌ సి పుష్కలంగా ఉండే ఈ పండు తినటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటివి దరిచేరవు. కేన్సర్‌కణాలతో పోరాడే లక్షణం వీటికుంది. లివర్‌ కేన్సర్‌, మెదడులో ట్యూమర్స్‌, బ్రెస్ట్‌ కేన్సర్‌ రాకుండా చేసే గుణం సీతాఫలానికుంది. ఈ పండ్లలో బి6 విటమిన్‌ అధికంగా ఉంటుంది. ఒత్తిడి, డిప్రెషన్‌ రాకుండా చేయటంతో పాటు మెదడు చురుగ్గా ఉండేందుకు ఉపయోగపడుతుంది. దంతాలకు మంచి ఆహారం. దంతాల్లోని నొప్పిని నివారిస్తుంది. వాంతులు రాకుండా చేసే గుణం సీతాఫలాలకుంది. ఐరన్‌ అధికంగా ఉండే సీతాఫలాలు తినటం వల్ల అనీమియా వ్యాధి రాదు. కళ్ల ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోపడుతుంది. సీతాఫలాలు తినటం వల్ల కీళ్లనొప్పులు వచ్చే శాతం తక్కువగా ఉంటుంది. గుండెకు మంచిది, డయాబెటిస్‌ దరి చేరనివ్వదు. జీర్ణక్రియమెరుగుపడుతుంది. చర్మం, వెంట్రుకల ఆరోగ్యానికి సీతాఫలాలు చక్కగాఉపయోగపడతాయి. చర్మ సమస్యల్ని నివాంచే లక్షణం కూడా వీటికి ఉంది.