ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ఈడీ) అధికారులు శనివారం సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, బంగారు ఆభరణాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు భారీగా నగదు, నగలు, బ్లాంక్ చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ రెడ్డితో పాటు నాయిని మాజీ పీఎస్ ముకుందారెడ్డి బంధువు వినయ్ రెడ్డి, నిందితురాలు దేవికా రాణి ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. వీరి ఇళ్లలో భారీగా నగదు, నగలు లభించినట్లు అధికారులు తెలిపారు. అంతేకాక ఏడు డొల్ల కంపెనీల నిర్వహకుడు బుర్రా ప్రమోద్ రెడ్డి ఇంట్లోనూ భారీగా నగలు, నగదు గుర్తించిన ఈడీ.. వాటిని స్వాధీనం చేసుకుంది. ఈ డొల్ల కంపెనీల వెనక కొందరు నేతల ప్రమేయం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేస్తోంది. మరో ఏడు ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి.
ESI కుంభకోణంలో నాయుని అల్లుడి ఇంట్లో నోట్ల కట్టలు
Related tags :