DailyDose

ఏసీపీ తుపాకీతో భార్యను కాల్చిన హోంగార్డు-నేరవార్తలు

ఏసీపీ తుపాకీతో భార్యను కాల్చిన హోంగార్డు-నేరవార్తలు

* బత్తిని శ్రీనివాసులు విజయవాడ పోలీస్ కమిషనర్.భార్యాభర్తల గొడవ నేపధ్యంలో హత్య జరిగింది.హోమ్ గార్డు వినోద్ అతి దగ్గర నుంచి కాల్పులు జరపడంతో భార్య సూర్య రత్న ప్రభ చనిపోయింది.2.50 లక్షలపైన బంగారాన్ని వినోద్ మణపురం లో తాకట్టు పెట్టాడు.అన్న పెళ్లి ఉందని బంగారం విడిపించాలన్న విషయంలో భార్యా భర్తల మధ్య గొడవలు.ఏఎస్పీ శశి భూషణ్ 9 ఎంఎం పిస్టల్ తో వినోద్ కాల్పులు జరిపాడు.చేతి నుంచి ఛాతీ లోపలగా తూటా బయటకు వచ్చింది.ఒక బులెట్ మాత్రమే కాల్పుల్లో వాడాడు.ఏఎస్పీ వెపన్ హోం గార్డు దగ్గర వదిలి వెళ్లటంపై కూడా చర్యలు ఉంటాయి.

* గోదావరిలో మునిగి ముగ్గురు యువకులు మృతి.చాగల్లులో విషాద ఛాయలు.ప.గో.జిల్లా…చాగల్లుకు చెందిన ముగ్గురు యువకులు కొవ్వూరు గోదావరి స్నానానికి వెళ్లి ఆదివారం సాయంత్రం గల్లంతు .సోమవారం తెల్లవారు జామున గజ ఈతగాళ్లతో వెలికితీసిన మృతదేహాలు.కొవ్వూరులో వకిల్ సాబ్ సినిమాకి వెళ్లిన ఆరుగురు స్నేహితులు సినిమా అనంతరం గోదావరి స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతు అయినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* జస్టిస్ ఈశ్వరయ్య ఫోన్ సంభాషణ కేసులో సుప్రీంకోర్టు తీర్పు.– ఫోన్ సంభాషణపై హైకోర్టు ఆదేశించిన దర్యాప్తు అవసరం లేదన్న సుప్రీం.– పిల్ నిర్వహణపై తప్ప హైకోర్టు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేదన్న ధర్మాసనం .– హైకోర్టులో దాఖలైన పిల్ మెరిట్స్ జోలికి తాము వెళ్లట్లేదన్న సుప్రీంకోర్టు.– పిల్ మెయింటైనబిలిటీని హైకోర్టు పరిగణించాలని సుప్రీంకోర్టు సూచన.– తీర్పు వెల్లడించిన జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సుభాష్ రెడ్డి ధర్మాసనం.– ఏపీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన జస్టిస్ ఈశ్వరయ్య.– మేజిస్ట్రేట్ తో ఫోన్లో వివాదాస్పదంగా మాట్లాడారని విచారణకు హైకోర్టు ఆదేశం.– ఫోన్ సంభాషణలో కుట్ర కోణం ఉందో.. లేదో తేల్చాలని హైకోర్టు ఆదేశం.– సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ రవీంద్రన్ ను నియమించిన హైకోర్టు.

* వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో పులివెందుల కేంద్రంగా కొనసాగుతున్న సి.బి.ఐ రహస్య విచారణ.రాత్రి వైయస్ వివేకానంద రెడ్డి ముఖ్య అనుచరులను విచారించి వారి వద్ద నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు.

* రాజస్థాన్​లో పొలం పనులు చేస్తున్నవారిపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించారు.