Devotional

ప్లవనామ సంవత్సర రాశిఫలాలు

Plava Nama Ugadi 2021 Telugu Panchanga Sravanam Rashi Phalalu

ఓం శ్రీగురుభ్యోనమః?
శుభమస్తు?

శ్రీ  ప్లవ నామ సంవత్సర పంచాంగము
  
పంచాంగకర్త : 
శ్రీ కాంచీ కామకోటి పీఠ ఆస్థాన సిద్ధాంతి
బ్రహ్మశ్రీ కుప్పా . శ్రీఆంజనేయ శాస్త్రి గారు

రాజపూజ్యం , అవమానాలు

మేషం         4     –     3
వృషభం      7     –     3
మిధునం     3     –     6
కర్కాటకం   6     –     6
సింహం       2     –     2
కన్య           5     –      2
తుల          1     –      5
వృశ్చికం.    4     –      5
ధనుస్సు     7     –      5
మకరం       3     –      1
కుంభం       6      –     1
మీనం         2   –       4

ఆదాయ , వ్యయాలు

మేషం         8     –     14
వృషభం      2     –       8
మిధునం     5     –       5
కర్కాటకం 14     –       2
సింహం        2    –     14
కన్య            5    –        5
తుల            2    –       8
వృశ్చికం.      8    –     14
ధనుస్సు      11   –       5
మకరం        14   –     14
కుంభం        14   –     14
మీనం          11   –       5

సంవత్సర నాయకాః

రాజు     –     కుజుడు
మంత్రి     –     బధః
సేనాధిపః     –     చంద్రః
సస్యాధిపః    –    శుక్రః
ధాన్యాధిపః    –    గురుః
అర్ఘాధిపః     –     కుజః
మేఘాధిపః     –     కుజః
రసాధిపః     –     రవిః
నీరసాధిపః     –     శుక్రః
పురోహితః     –     శుక్రః
పరీక్షకః     –     గురుః
గణకః     –     శనిః
గ్రామపాలకః     –     కుజః
దైవజ్ఞః     –     చంద్రః
రాష్ట్రాధిపః     –      కుజః
ఉద్యోగపః     –     బుధః
అశ్వాధిపః     –     బుధః
గజాధిపః     –     శుక్రః
పశ్వధిపః     –     కుజః
దేవాధిపః     –     శుక్రః
నరాధిపః     –     చంద్రః
గ్రామపః     –     గురుః
వస్త్రధిపః     –     రవిః
రత్నధిపః     –    కుజః
వృక్షాధిపః     –     గురుః
జంగమాధిపః     –     శుక్రః
సర్పాధిపః     –     శనిః
మృగాధిపః     –     చంద్రః
శుభాధిపః     –     కుజః
స్త్రీణామధిపః     –     కుజః

మకర సంక్రాంతి పురుష ఫలమ్

ఈ సంక్రాంతి పురుషునకు  మిశ్రుడు  అని పేరు. ఇతడు శంఖ జలముచే స్నానం చేసి , ఎర్రని వస్త్రములు ధరించి , చందనపు గంధమును పూసుకొని , జాజి పుష్పములను , మరియు ముత్యాల తో కూడిన ఆభరణాలు ధరించిన వాడై , వెండిపాత్రలో పాయసము భుజించి , అరటి పండ్లను సేవించి , భిండీవాలమును ఆయుధముగా చేపట్టి  వ్యాఘ్ర వాహనము ను ఎక్కి , ఎర్రని గొడుగును ఆఛ్ఛాదనతో ఖడ్గమును ధరించి దక్షిణ దిక్కు గా ప్రయాణం చేయుచూ , క్రోధముగా కూర్చుని ఉండెను. 
ఈ రకమైన సంక్రాంతి పురుషుని స్థితి వలన అందరికీ కొద్దిగా అనారోగ్యం కలుగుచున్ననూ మొత్తం మీద శుభకరంగాను , శుభప్రధంగానూ ఉండును.  కాగా పశువుల కు అన్ని రకాలుగా కీడు పెరుగును.  అందరిలోనూ యుధ్ధభయం పెరుగును.  స్త్రీలకు కొంత అరిష్టములు కలుగుచున్ననూ , కీర్తివంతులగుదురు.  ముత్యములకు కొంత విలువ తగ్గును.  ముఖ్యంగా దక్షిణ ప్రాంతంలో దుర్భిక్షం కొంతమేర పెరుగును.  ధరలు కూడా అధికమగును.  మిగిలిన ప్రాంతాలవారికి కొంత ఆరోగ్య వృధ్ధి. ఆ ప్రాంతాల్లో సస్యవృధ్ధి బాగుండును.  కాగా మొత్తం మీద ఆరోగ్యం , సస్యవృధ్ధి లతో కొంతవరకు శుభంగానే ఉండును.

ప్లవ నామ సం ౹౹ మాస శివరాత్రులు

మే,10
జూన్ , 8
జూలై, 8
ఆగష్టు , 6
సెప్టెంబర్, 5
అక్టోబర్, 4
నవంబర్, 3
డిశెంబర్, 2
జనవరి, 1
జనవరి, 30
మార్చి, 1
మార్చి, 30

గ్రహణములు

ఈ సం ౹౹ ప్రపంచంలో 4 గ్రహణములు ఏర్పడును.

2 సూర్య గ్రహణములు ది 10.06.2021గురువారం మరియు  కార్తీక బహుళ అమావాస్య శనివారం ది. 04.12.2021

2 చంద్ర గ్రహణములు వైశాఖ శుక్ల పూర్ణిమ ది 26.05.2021 బుధవారం. మరియు కార్తీక పూర్ణిమ ది 19.11.2021, శుక్రవారం.  వీటిలో ఏదీ భారతదేశం లో కనిపించవు.

కనిపించని గ్రహణాలకు ఏ విధమైన నియమాలు పాటించనక్కరలేదు

ప్లవ నామ సం ౹౹ శని త్రయోదశులు

ఏప్రియల్, 24
సెప్టెంబర్, 4
సెప్టెంబర్, 18
జనవరి, 15

ప్లవ నామ సం ౹౹ సంకటహర చతుర్దులు

ఏప్రియల్, 30
మే,29
జూన్ , 27
జూలై, 27
ఆగష్టు , 25
సెప్టెంబర్, 24
అక్టోబర్, 24
నవంబర్, 22
డిశెంబర్, 22
జనవరి, 21
ఫిబ్రవరి, 20
మార్చి, 21

కర్తరీ సమయము

చైత్ర కృష్ణ అష్టమి మంగళవారం ( 04.05.2021 ) నుండి డొల్లు కర్తరీ.  చైత్ర కృష్ణ అమావాస్య మంగళవారం ( 11.05.2021 ) లగాయతు వైశాఖ కృష్ణ విదియ శుక్రవారం ( 28.05.2021 ) వరకు నిజ కర్తరీ.

మౌఢ్య సమయములు.

గత మాఘ శుక్ల  పాడ్యమి శుక్రవారం 12.02.2021 నుండి ఈ సం ౹౹ చైత్ర కృష్ణ అష్టమి సోమవారం 04.05.2021 వరకు  శుక్ర మౌఢ్యమి
పుష్య శుక్ల పాఢ్యమి సోమవారం 03.01.2022 నుండి పుష్య శుక్ల ద్వాదశి శుక్రవారం 14.01.2022 వరకు శుక్ర మౌఢ్యమి మాఘ కృష్ణ తదియ శనివారం 19.02.2022 నుండి ఫాల్గున కృష్ణ పాఢ్యమి శనివారం 19.03.2022 వరకు  గురు మౌఢ్యమి

పుష్కర ప్రవేశ సమయము