Food

గుమ్మడికాయతో రక్తహీనత దూరం

గుమ్మడికాయతో రక్తహీనత దూరం

గుమ్మడితో కూర, పులుసు, సూప్‌.. వంటివి చేసుకుంటాం. ఇది కేవలం రుచి మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. దీనివల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయంటే…
* గుమ్మడి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని పీచు, విటమిన్‌ సి గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఎముక సాంద్రత దృఢపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
* ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్‌ ఇ, బీటాకెరొటిన్లు అధికంగా ఉంటాయి. ఇవి కంటిచూపు స్పష్టంగా ఉండటానికి దోహదం చేస్తాయి. కంటి సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చదువుకునే పిల్లలకు గుమ్మడితో చేసిన వంటకాలు తినిపించడం ఎంతో మంచిది.
* తల్లి కావాలనుకుంటున్నవారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఇనుము సంతానసాఫల్యతను పెంచుతుంది. దీనిలో ఉండే విటమిన్‌ ఎ శరీరంలో బీటాకెరొటిన్‌గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా కాపాడుతుంది.
* విటమిన్‌ సి అందించే కూరగాయల్లో గుమ్మడి కూడా ఒకటి. ఇది శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. ఫలితంగా రకరకాల వైరస్‌లూ, ఇన్‌ఫెక్షన్లు దూరమవుతాయి.
* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజల్ని తినొచ్చు. ఇవి శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడంతో ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.