WorldWonders

నిత్యానంద మరో వేషం

నిత్యానంద మరో వేషం

రాసలీలల బాబా నిత్యానంద స్వామి తన చేష్టలతో మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి అయన చేసిన ఘన కార్యం ఏంటంటే…ప్రపంచవ్యాప్తంగా భక్తుల పాలిట కొంగు బంగారమైన శ్రీనివాసుడి అవతారమెత్తిన ఫోటోలు బయటకు రావడంతో భక్తులు అగ్గిమీద గుగ్గిలమాతున్నారు.

బాబాల పేరుతో సాగిస్తున్న అరాచకాలు మోసాలు, రాసలీలలు దేశంలో ఇబ్బడి ముబ్బడిగా వెలుగులోకి వస్తున్నాయి. అయినా బాబాలు ఏదోరకంగా భక్తులను బురుడి కొట్టించెందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. తామే దైవంశ సంభూతులమని, తామే దేవుడి ప్రతి ఇద్దులమని నమ్మించేందుకు ఏకంగా దేవుడి అవతారలెత్తుతూ భక్తులకు శఠాగోపం పెట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అటువంటిదే మరొకటి వెలుగులోకి వచ్చింది.

నిత్యానంద స్వామి ఈ పేరు దేశంలో తెలియని వరుండరు. .. దేశంలో స్వామీజీగా అవతారం ఎత్తి తమిళనాడు రాష్ట్రంలో పూజలందుకున్న స్వామి. సినీతారా రంజితతో రాసలీలలు వ్యవహారం బయటపడడమీ కాకుండా తన భక్తులైన అమ్మాయిలపై అత్యాచారం చేశాడంటూ పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ఆ కేసులో బెయిల్ పై విడుదలై చల్లగా దేశం దాటి వెళ్లి దక్షిణ అమెరికా ఖండంలోని ఈక్వెడార్ దేశం పక్కనే ఉన్న సముద్రంలోని ఓ దీవిని కొని అక్కడే ఏకంగా ‘ కైలాస ‘ అనే దేశాన్ని కూడా ఏర్పాటు చేసుకుని తన దేశానికీ గుర్తింపు నివ్వాలంటూ ఐక్యరాజ్యసమితికి సైతం అప్పీల్ చేసి వార్తల్లో నిలిచాడు నిత్యనంద స్వామి. కలియుగంలో భక్తుల పాలిట కొంగు బంగారమై కోరికలను తీర్చే భవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అవతారంలో నిత్యానంద స్వామి ఫోటోలు బయటకు రావడంతో వేంకన్న బాబు భక్తులు అగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.