Kids

2గంటల్లో 36పుస్తకాలు చదివేసి రికార్డు

2గంటల్లో 36పుస్తకాలు చదివేసి రికార్డు

నేటి సాంకేతిక యుగంలో నెలల వయసున్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆన్‌లైన్‌లో బిజీగా గడిపేస్తున్నారు. వీడియో గేమ్స్‌లో మునిగి తేలుతోన్న పిల్లలకు స్కూల్‌ బుక్స్‌ చదివే తీరిక కూడా ఉండడంలేదు. అటువంటిది ఐదేళ్ల చిన్నారి తక్కువ సమయంలో ఎక్కువ పుస్తకాలు చదివి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇండో అమెరికన్‌ చిన్నారి కియరా కౌర్‌కు పుస్తకాలు చదవడమంటే ఎంతో ఇష్టం. ఈ ఇష్టంతో 36 పుస్తకాలను రెండుగంటల్లోపే చదివి అతిచిన్న వయసులో.. లండన్‌ వరల్డ్‌ రికార్డ్, ఆసియా వరల్డ్‌ రికార్డుల జాబితాలో తన పేరును చేర్చింది.