Business

RTGS సేవల నిలుపుదల-వాణిజ్యం

* పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు నిర్వహించే వారికి ఆర్‌బీఐ కీలక అలర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 18న దేశవ్యాప్తంగా రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ (ఆర్‌టీజీఎస్) సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఈ నెల 17న సాధారణ కార్యకలాపాలు ముగిసిన తర్వాత 18న రాత్రి 00:00 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు 14 గంటల పాటు సేవలు నిలిచిపోనున్నట్లు ప్రకటించింది. ఆర్‌టీజీఎస్ సేవల విషయంలో భారీ స్థాయిలో అప్‌గ్రేడేషన్ జరుగుతోంది. డిజాస్టర్ రికవరీ టైమ్‌ని పెంచేందుకు టెక్నికల్ అప్‌గ్రేడ్ చేస్తున్నారు. దీంతో కొన్ని గంటల పాటు ఆర్‌టీజీఎస్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు చెప్పింది. ఆర్‌బీఐ ఆర్‌టీజీఎస్ సేవలు నిలిచిపోయిన సమయంలో వినియోగదారులు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ టాన్స్‌ఫర్(నెఫ్ట్) సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంది.

* దేశంలో కరోనా కల్లోలంతో కొద్దీ రోజులు నష్టాల్లో కొనసాగిన స్టాక్‌మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. కీలక రంగాల షేర్లలో కొనుగోళ్ల అండతో వరుసగా రెండో రోజు లాభాలతో ముగించాయి. భారత్‌లో కరోనా వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు గానూ విదేశీ టీకాలకు అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయడంతో గత సెషన్‌లో జోరుగా సాగిన సూచీలు.. నేడు కూడా అదే బాటలో పయనించాయి. 48,512 పాయింట్లతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన సెన్సెక్స్ ఆరంభంలో కాస్త ఒడుదొడుకులను ఎదుర్కొని చివరకు 259.62 పాయింట్ల లాభంతో 48,803.68 వద్ద ముగిసింది.

* ఆన్‌లైన్ ట్రావెల్, టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్రిప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గురువారం(ఏప్రిల్ 4) ప్రకటించింది. క్లియర్‌ ట్రిప్ 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఈ-కామర్స్ సంస్థ తెలిపింది. ఒప్పందం ప్రకారం, క్లియర్‌ట్రిప్ కార్యకలాపాలు అన్ని ఫ్లిప్‌కార్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. అలాగే, ఇది ఇలాగే ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగుతుంది. క్యాష్​, ఈక్విటీల రూపంలో మొత్తం 40 మిలియన్​ డాలర్లను ఫ్లిప్​కార్ట్​ క్లియర్​ ట్రిప్​కు చెల్లించనుంది.

* ఇప్పటికే 200 నగరాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న జియో మార్ట్‌ సంస్థ .. కిరాణా దుకాణాదారులను డెలివరీ వ్యవస్థ ఆఖరు దశలోనూ(లాస్ట్‌ మైల్‌ డెలివరీ – ఎల్‌ఎండీ) భాగస్వాములుగా చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం ఫ్యూచర్‌ గ్రూప్‌ రిటైల్‌ వ్యాపార విభాగాన్ని (ప్రస్తుతం కొనుగోలు ప్రయత్నాల్లో ఉంది) ఉపయోగించుకోవచ్చని భావిస్తోంది. తద్వారా దేశీయంగా సంఘటిత రిటైల్‌ రంగంలో 17 శాతం వాటాను దక్కించుకుంటే.. తయారీ సంస్థలతో మరింతగా బేరమాడి ఇంకా తక్కువ రేటుకే ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చని యోచిస్తోంది.

* భార‌త్ లో చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా వ్యాపారాలు, స్టార్ట‌ప్ ల‌ను ప్రోత్స‌హించేందుకు అమెజాన్ ఇండియా గురువారం 250 మిలియ‌న్ డాల‌ర్ల‌తో వెంచ‌ర్ ఫండ్ ను ప్ర‌క‌టించింది. ఈ నిధులను ప్ర‌ధానంగా ఆయా వ్యాపారాల డిజిట‌లీక‌ర‌ణ‌, వ్య‌వ‌సాయం, ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ల‌పై వెచ్చిస్తారు. సాంకేతిక రంగంలో ప‌నిచేసే స్టార్ట‌ప్ ల్లోనూ వెంచ‌ర్ ఫండ్ పెట్టుబ‌డులు పెడుతుంది.

* పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో మార్చిలో ధ‌ర‌లు చుక్క‌లు తాకాయి. మార్చిలో దేశ టోకు ధ‌ర‌ల సూచీ ద్ర‌వ్యోల్బ‌ణం ఎనిమిదేండ్ల గ‌రిష్ట‌స్ధాయిలో ఏకంగా 7.39 శాతానికి ఎగ‌బాకింది. ఇంధ‌న‌, విద్యుత్ ధ‌ర‌లు పెను భారం కావ‌డంతో మార్చిలో టోకు ధ‌రల సూచీ ఆధారిత ద్ర‌వ్యోల్బ‌ణం పైపైకి ఎగిసింది.