Devotional

భద్రాచలం ఆలయ పరిసరాల్లో లాక్‌డౌన్

భద్రాచలం ఆలయ పరిసరాల్లో లాక్‌డౌన్

రామాలయంలో ఈసారి సీతారాముల కల్యాణం వీక్షించే భాగ్యం దక్కుతుందని అంతా భావించారు. కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుండడంతో రాములోరి పెళ్లి, పట్టాభిషేకం వేడుకలకు భక్తులకు ప్రవేశం లేదని తేల్చి చెప్పారు. అంతకు ముందు చిత్రకూట మండపంలో వేడుకలను నిర్వహించి యథాతథంగా మూలవిరాట్‌ దర్శనాలు ఉంటాయని చెప్పడంతో అదే మహాభాగ్యంగా భక్తులు మురిసిపోయారు. కానీ ప్రస్తుత పరిస్థితులపై సమాలోచనల తర్వాత కల్యాణ క్రతువును నిత్య కల్యాణ మండపంలో చేసేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత అన్ని దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఈవో ప్రకటించారు. పూజలను వైదిక పెద్దలు కొనసాగిస్తారు. ఆలయ పరిసరాల్లో అప్రకటిత లాక్‌డౌన్‌ అమలుకానుంది.