DailyDose

కామాంధుడిపై బందరు మహిళ దాడి-నేరవార్తలు

కామాంధుడిపై బందరు మహిళ దాడి-నేరవార్తలు

* ఏసీబీకి చిక్కిన విద్యుత్ డీఈ. కరెంట్‌ లైన్‌కు రూ.35 వేల లంచం డిమాండ్‌విద్యుత్తు లైన్‌ మంజూరుకు కాంట్రాక్టర్‌ నుంచి రూ.35 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్తుశాఖ డివిజనల్‌ ఇంజినీర్‌ గురువారం ఏసీబీకి చిక్కా డు.ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం………..మింట్‌ కంపౌండ్‌లో ఉన్న టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌లోని చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (కమర్షియల్‌) కార్యాలయంలో గజవాడ మనోహర్‌ డీఈగా పనిచేస్తున్నాడు.యాద్రాది భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండలంలోని ఒక వెంచర్‌లో 5 కేవీ నాన్‌డొమెస్టిక్‌కు సంబంధించిన ఎల్టీ క్యాటగిరి-2 లైన్‌ వేయాలని కాంట్రాక్టర్‌ బొల్లారం బాలనర్సింహ డీఈని సంప్రదించారు.డీఈ లంచం డిమాండ్‌ చేయడంతో కాంట్రాక్టర్‌ ఏసీబీని ఆశ్రయించారు.గురువారం కాంట్రాక్టర్‌ బాలనర్సింహ నుంచి రూ.35 వేల లంచం డీఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

* మచిలీపట్నం లో మహిళా హల్ చల్. కృష్ణ అనే వ్యక్తిపై దాడి చేసిన మహిళ స్వప్న. ఫోన్ చేసి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ స్వప్న.

* మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ విచారిస్తుంది.

* పొట్టకూటి కోసం సొంతరాష్ట్రం వదిలి మహారాష్ట్ర వెళ్లిన ఓ కుటుంబాన్ని కరోనా మహమ్మారి పొట్టనబెట్టుకుంది. కొవిడ్‌తో భర్త చనిపోవడంతో మనస్తాపానికి గురైన భార్య చెరువులో మునిగి ఆత్మహత్య చేసుకుంది. అమ్మ ఎందుకు నీటిలోకి వెళ్తుందో అర్థంగాక మూడేళ్ల కొడుకు ఆమె వెంటే నడుచుకంటూ వెళ్లాడు. దీంతో అభం శుభం తెలియని ఆ చిన్నారి కూడా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. బుధవారం రాత్రి నాందేడ్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి కొన్నాళ్ల కిందట ఉపాధి కోసం తన కుటుంబంతో కలిసి నాందేడ్‌లోని లోహ్‌కు వచ్చాడు. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 13న మృతిచెందాడు. దీంతో అతడి భార్య తీవ్ర మనస్తాపానికి లోనైంది. బుధవారం రాత్రి తన మూడేళ్ల చిన్నకుమారుడిని తీసుకుని దగ్గర్లోని సునెగావ్‌ చెరువుకు వెళ్లింది. అక్కడ గట్టుపై కొడుకును ఉంచి చెరువులోకి నడుచుకుంటూ వెళ్లి నీటిలో మునిగి ఆత్మహత్య చేసుకుంది. తల్లి ఏం చేస్తుందో అర్థం చేసుకోని వయసు ఆ చిన్నారిది. అమ్మ కోసం ఏడుస్తూ ఆ చిన్నారి కూడా చెరువులోకి నడుచుకుంటూ వెళ్లి నీటిలో మునిగిపోయాడు.

* చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో గుర్తు తెలియని మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. నడుమూరు సమీపంలోని కుప్పం- కృష్ణగిరి జాతీయ రహదారి పక్కన స్థానికులు ఈ ఉదయం అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న ఓ బ్యాగును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బ్యాగును తెరిచి చూడగా మృతదేహం సగ భాగం లభ్యమైంది. నడుము భాగం నుంచి దిగువ కాళ్ల వరకు మాత్రమే బ్యాగులో కుక్కి పడేశారు. కాగా, మిగతా సగభాగం కోసం పోలీసులు పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.