DailyDose

Breaking: శంషాబాద్‌లో ఘోర ప్రమాదం. ఆరుగురు దుర్మరణం.

Lorry Hits Car In Shamshabad - Kills Six

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు, లారీని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మృతి చెందగా… 15 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు లారీ కింద ఇరుక్కున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షత గాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో లారీలో 30 మందికిపైగా కార్మికులు ఉన్నట్లు సమాచారం. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై ఆరాతీస్తున్నారు.